E-Paper
Advertisement

కంగారులు కాదు, వాళ్లు న‌ర‌రూప రాక్ష‌సులు…బంగ్లా బ్యాట‌ర్ల‌కు ఇక న‌ర‌క‌మే

కంగారులు కాదు, వాళ్లు న‌ర‌రూప రాక్ష‌సులు…బంగ్లా బ్యాట‌ర్ల‌కు ఇక న‌ర‌క‌మే
Advertisement

BAN VS AUS: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (Australia vs Bangladesh) మధ్య టెస్ట్ సిరీస్ ( Bangladesh tour of Australia, 2026 ) ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గురువారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రెండు జట్లు కూడా సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియాలోని మరారా క్రికెట్ మైదానం, డార్విన్
వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ గురువారం ఉదయం 6 గంటల సమయంలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ బ్యాటర్లను వణికించేలా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో బంగ్లాదేశ్ కు వెళ్లిన ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు భయంకరమైన ఐదుగురు బౌలర్లు బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ బ్యాటర్లు గజగజ వణికి పోతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను ఎదుర్కోవడం కష్టమేనని అర్ధరాత్రుళ్ళు ఉలిక్కిపడుతున్నారట.

కంగారులు కాదు, వాళ్లు న‌ర‌రూప రాక్ష‌సులు…బంగ్లాకు ఇక న‌ర‌క‌మే

బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బంగ్లా క్రికెటర్లు వణికిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మిన్స్‌, జోష్ హేజిల్ వుడ్, స్కాట్ బోలాండ్ , మిచెల్ స్టార్క్ లాంటి భయంకరమైన ఫాస్ట్ బౌలర్లు బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సందర్భంగా బరిలోకి దిగుతున్నారు. చాలా రోజులుగా ఈ తోపు క్రికెటర్లు జట్టుకు దూరమయ్యారు. గాయాల బారిన పడ్డారు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ కోలుకొని, బంగ్లాదేశ్ పైన పంజా విసిరేందుకు సిద్దమయ్యారు. అటు నాథన్ లైన్ స్పిన్ విభాగంలో తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఇలా భయంకరమైన బౌలింగ్ ఎటాక్ తో ఆస్ట్రేలియా సిద్ధం అయిన నేపథ్యంలో… బంగ్లాదేశ్ బ్యాటర్లు కాస్త వణికిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

హెల్మెట్లు, గాడ్లు, ప్యాడ్స్ ప‌టిష్టంగా ఉండాల్సిందే

ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత భయంకరమైన బౌన్సర్లు వస్తాయి. బౌన్సర్లు ఆడడంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు చాలా వీక్. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లను ఎదుర్కోవడం చాలా కష్టమవుతుందని క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని బంగ్లా క్రికెటర్లకు వార్నింగులు ఇస్తున్నారు. హెల్మెట్లు, గాడ్లు, ప్యాడ్స్ అన్ని పటిష్టంగా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కాస్త లైట్ తీసుకున్నా, తలలు పగలడం లేదా కాళ్లు, చేతులు విరగడం గ్యారంటీ అని హెచ్చరిస్తున్నారు. మరి ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లను బంగ్లాదేశ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. కాగా ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆగస్టు 13వ తేదీ నుంచి మొదటి టెస్ట్ జరగనుండగా.. ఆగస్టు 22వ తేదీన చివరి టెస్ట్ ఉంటుంది.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

 

Related News

వ‌ర్షం ప‌డి, టీమిండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్స్ ర‌ద్దు కావాలి

పాకిస్తాన్ క్రికెట్ లో విషాదం…130 కేజీల ఆజం ఖాన్ మృతి ?

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

దక్షిణాఫ్రికా జట్టులో చీలిక..తన్నుకున్న తెంబా బ‌వుమా, క్వింటన్ డికాక్

బస్సు దిగుతుండగా బొక్క బోర్లా పడ్డ రోహిత్ శర్మ… పగలబడి నవ్విన విరాట్ కోహ్లీ?

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేది

Big Stories

Advertisement
×