E-Paper
Advertisement

23 ఏళ్ల కింద‌ట అవ‌మానం…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పైనే ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లా

23 ఏళ్ల కింద‌ట అవ‌మానం…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పైనే ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లా
Advertisement

Bangladesh Beat Australia: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. తోపు క్రికెటర్ లో ఉన్న కంగారు జట్టును ఆస్ట్రేలియా గడ్డపై చిత్తుగా ఓడించింది ( Bangladesh Beat Australia) బంగ్లాదేశ్. ఈ రెండు జ‌ట్లు మధ్య ఆగస్టు 13వ తేదీన తొలి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ ను కేవలం నాలుగు రోజుల్లోనే ఫినిష్ చేసి, ఆస్ట్రేలియా జట్టును అత్యంత దారుణంగా ఓడించింది బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లా విజయం నమోదు చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

23 ఏళ్ల కింద అవమానించారు.. ఇప్పుడు పళ్ళు రాలగొట్టుకున్నారు

సరిగ్గా 23 సంవత్సరాల కిందట బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును ఆస్ట్రేలియా అవమానించింది. అసలు బంగ్లాదేశ్ జట్టుకు టెస్ట్ క్రికెట్ ఆడే అర్హత లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ హుక్స్ (David Hookes) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీవా కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇదే డేవిడ్ హుక్స్ ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్నాడు. ఆ సమయంలో బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ జట్టుకు అసలు టెస్ట్ క్రికెట్ ఆడే అర్హత లేదని హేళన చేస్తూ మాట్లాడారు డేవిడ్ హుక్స్. తమతో ఆడితే ఒకే ఒక్క రోజులో వాళ్లను ఫినిష్ చేస్తామని దారుణంగా మాట్లాడారు.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

23 ఏళ్ల కిందట డేవిడ్ హుక్స్ ఈ వ్యాఖ్యలు చేయగా… అదే బంగ్లాదేశ్ జట్టు, 2026 ఆగస్టు 16వ తేదీన అంటే ఇవాళ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 23 ఏళ్ల కిందట అవమానాన్ని ఎదుర్కొన్న బంగ్లాదేశ్… అదే చోట ప్రతి కారం తీర్చుకుంది. ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లాదేశ్… తొలిసారిగా కంగారు గడ్డపై విక్టరీని నమోదు చేసుకుంది. దీంతో బంగ్లాదేశ్ క్రికెటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. అటు మాజీ క్రికెటర్లు కూడా బంగ్లాదేశ్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆస్ట్రేలియా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ పై విమ‌ర్శ‌లు చేశారు. బ‌ల‌మైన జ‌ట్టు త‌మదేన‌ని విర్ర వీగి, ప‌సికూన బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఆస్ట్రేలియా ఓడింద‌ని పేర్కొంటున్నారు.

9 వికెట్ల తేడాతో బంగ్లా చేతిలో ఆస్ట్రేలియా ఘోర ఓట‌మి

Advertisement

ఆస్ట్రేలియా జట్టును తొలి టెస్ట్ లోనే దెబ్బ కొట్టింది బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో 198 పరుగులు మొదటి ఇన్నింగ్స్ లో చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 284 పరుగులు మాత్రమే చేసింది. ఇక అటు బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 426 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్స్ లో 57 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసుకొని చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

Tags

Related News

బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోర‌ ఓట‌మి..టీమిండియాకు బిగ్ రిలీఫ్‌

మెట్ల‌పైనే కుప్ప‌కూలిన‌ కేఎల్ రాహుల్…బీసీసీఐ చేత‌గానీ త‌న‌మే కార‌ణమంటూ విమ‌ర్శ‌లు !

మా హోట‌ల్ రూంకు వ‌చ్చి, కొడ‌తాన‌ని షోయ‌బ్ అక్త‌ర్ వార్నింగ్ ఇచ్చాడు

గాయాల పేరుతో బుమ్రా డ్రామాలు..1000 జ‌న్మలు ఎత్తినా వ‌సీం అక్ర‌మ్ స్థాయికి చేరుకోడు!

ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నాన‌ని, దేశద్రోహి ముద్ర వేశారు

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి, గౌర‌వించండి.. బీసీసీఐపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు!

ఇప్పుడే సంబ‌రాలే చేసుకోవ‌ద్దు..బంగ్లాదేశ్ కు ర‌మీజ్ రాజా హెచ్చ‌రిక‌

Big Stories

Advertisement
×