E-Paper
Advertisement

పిల్లల కోసం మహీంద్రా BE 6 బేబీ ఎడిషన్.. బుల్లి ఎలక్ట్రిక్ కారు భలే ఉందిగా!

పిల్లల కోసం మహీంద్రా BE 6 బేబీ ఎడిషన్.. బుల్లి ఎలక్ట్రిక్ కారు భలే ఉందిగా!
Advertisement

Mahindra BE 6 Baby Edition: మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అయితే, ఇప్పుడు ఈ కారు  పిల్లల కోసం చిన్న వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. దీనికి మహీంద్రా BE 6  బేబీ ఎడిషన్ గా పేరు పెట్టింది. అయితే, ఇది రోడ్డ మీద కాకుండా, పిల్లల కోసం తయారు చేసిన రైడ్ ఆన్ టాయ్. దీని ధర రూ.18,000 నుంచి రూ.18,500 మధ్యలో ఉంటుంది.

అచ్చం BE 6 లాగే! 

పెద్దల కోసం తయారు చేసిన అసలు మహీంద్రా BE 6 పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దాని ధర రూ.19.45 లక్షల ఎక్స్‌షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది. కానీ, బేబీ ఎడిషన్ మాత్రం దానికి చాలా చిన్న మినియేచర్ మోడల్. కేవలం పిల్లలు సరదాగా డ్రైవ్ చేసేందుకు దీనిని రూపొందించారు. పేరు, డిజైన్ విషయంలో అసలు BE 6ను పోలి ఉండటంతో చిన్నారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఆటోమొబైల్స్‌ పై ఆసక్తి ఉన్న పిల్లలకు ఇది మంచి గిఫ్ట్‌ గా కూడా ఉపయోగపడుతుంది.

పిల్లలే డ్రైవ్ చేయొచ్చు!

Advertisement

ఈ మినీ BE 6 ప్రత్యేకత ఏమిటంటే పిల్లలు స్వయంగా దీనిని నడపవచ్చు. అయితే, భద్రత కోసం తల్లిదండ్రులకు రిమోట్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. అవసరమైనప్పుడు పెద్దలు రిమోట్ ద్వారా కారు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది పిల్లలకు కారు నడుపుతున్న అనుభూతిని కలిగించేలా రూపొందించారు. ఇంటి ప్రాంగణంలో, ప్రైవేట్ ప్రదేశాల్లో వినోదం దీనిని ఉపయోగించుకోవచ్చు.

ఫార్ములా ఈ థీమ్‌ తో డిజైన్

బేబీ BE 6 డిజైన్ విషయంలో కూడా మహీంద్రా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఫార్ములా ఈ రేసింగ్ థీమ్‌ ను ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. సిగ్నేచర్ గ్రాఫిక్స్, ఓపెన్ చేయగలిగే డోర్లు, LED హెడ్‌ లైట్లు, LED టెయిల్‌ లైట్లు లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ అసలు మోడల్‌కు దగ్గరగా కనిపించేలా డిజైన్ చేయడం దీని ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు.

చక్కటి ఫీచర్లు కూడా!   

Advertisement

పిల్లల కోసం రూపొందించిన టాయ్ అయినప్పటికీ ఇందులో కొన్ని టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. డిజిటల్ కాక్‌పిట్ తరహాలో కనిపించే డిస్‌ ప్లే ఉండటంతో డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే, బ్లూటూత్‌ కు లింక్ చేసే ఆడియో సిస్టమ్‌ను కూడా అందించారు. దీంతో పిల్లలు తమకు నచ్చిన ఆడియోను వినే అవకాశం ఉంటుంది.

డెలివరీలు ప్రారంభం

ఈ మినియేచర్ BE 6 రైడ్-ఆన్ టాయ్‌కు సంబంధించిన డెలివరీలు అధికారికంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిని నేరుగా మహీంద్రా డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది. రూ.18 వేల నుంచి ప్రారంభమయ్యే ధరతో ఇది సాధారణ బొమ్మల కంటే ఖరీదైనదే అయినప్పటికీ, కార్లపై ఆసక్తి ఉన్న పిల్లలకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.

Read Also: మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ vs టయోటా హిలక్స్.. ఏ పికప్ బెస్ట్?

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×