RAITHU BHAROSA: తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రైతుభరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. వానాకాలం సీజన్ లో పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేటి నుంచి డబ్బులు జమకానున్నాయి. రైతుభరోసా స్కీంకు సంబంధించిన లబ్దిదారుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు అందజేసిన సంగతి తెలిసిందే.
వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా
పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.12వేలు రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వానాకాలం సీజన్ కు సంబంధించి ఎకరాకు రూ.6వేల చొప్పున రైతుల అకౌంట్లలో దశల వారీగా ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. అయితే రేవంత్ సర్కార్ ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా స్కీం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ALSO READ: Piyush Goyal: సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు.. పీయూష్ గోయల్‌కు తప్పిన ప్రమాదం
రేపటి నుంచి అకౌంట్లలో డబ్బులు జమ
ఇక ఎన్ని ఎకరాలు ఉన్నా.. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచే సర్కార్ రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేయనుంది. 9 రోజుల్లోనే రైతుల అకౌంట్లలోడబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైతు నేస్తం స్కీం ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతుల కోసం రైతుభరోసా పథకం ప్రారంభించామని ఆయన చెప్పారు. రైతుల కోసం ఇప్పటి వరకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని అన్నారు. రైతులకు 9 రోజుల్లో 9 కోట్లు ఇస్తామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల కష్టాలు పడకూడదని రైతు భరోసా స్కీం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ALSO READ: Sonia Gandhi: ఆస్పత్రిలో సోనియాగాంధీ.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఎకరాలతో సంబంధం లేకుండా రైతుభరోసా: సీఎం
ఎకరాలతో సంబంధం లేకుండా రైతుభరోసా పథకం అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 70,11,984 మంది రైతులకు రైతు భరోసా స్కీం అందజేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. మొత్తం కోటి 49 లక్షల ఎకరాలకు నిధులు విడుదల చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే 9 రోజుల్లో ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బు అందుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వల్ల అన్ని వ్యవస్థలను సరిదిద్దాల్సి వస్తోందని చెప్పారు. పథకాలు అమలు చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తోందని వివరించారు. కష్టాలున్నా వెలుగులోకి నడిపించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.