BigTV English
Advertisement

BCCI Invites Applications on Head Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. కొత్త కోచ్ ఎవరు..?

BCCI Invites Applications on Head Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. కొత్త కోచ్ ఎవరు..?

BCCI Invites Applications on Head Coach for Ream India: టీమిండియా కొత్త కోచ్ ఎవరు? ఇండియాకి చెందిన మాజీ ఆటగాడా? లేక ఫారెన్ కోచ్‌ని ఎంపిక చేస్తుందా? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది. మెజార్టీ మాజీ ఆటగాళ్లు మాత్రం ఇండియా వ్యక్తి అయితే బాగుంటుందని అంటున్నారు. ఎందుకు కారణాలు లేకపోలేదు.


ఐపీఎల్ పుణ్యమాని విదేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు వివిధ జట్లకు కోచ్‌గా ఉన్నారు. వాళ్ల సలహాలు యువ క్రికెటర్లకు బాగానే కలిసి వస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో ఫారెన్ కోచ్‌ను తీసుకోవడం, ఇక్కడి పరిస్థితులకు వచ్చే వ్యక్తి సెట్ అయ్యేసరికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. లేకపోతే రాహల్ ద్రావిడ్ కంటిన్యూ చేస్తే బాగుంటందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా టీమిండియా కొత్త కోచ్ కోసం వేట మొదలుపెట్టింది బీసీసీఐ. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చేసింది. దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు మే 27 చివరి తేది. నోటిఫికేషన్‌లో కోచ్ అర్హతకు సంబంధించిన కొన్ని నిబంధనలను వెల్లడించింది. కోచ్ వయస్సు 60 ఏళ్ల లోపు ఉండాలన్నది ఒకటి. కనీసం 30 టెస్టులు, 50 వన్డేలు ఆడి ఉండాలన్నది మరో రూల్. అంతేకాదు టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్టుకు కనీసం రెండేళ్లపాటు అందులో సభ్యుడి ఉండాలన్నది మరొకటి. ఇక సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్లు పరిశీలించిన తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. దాని తర్వాత ప్రకటన చేయనుంది బీసీసీఐ. ఎంపిక అయిన కొత్త కోచ్ జులై ఒకటి నుంచి బాధ్యతలు తీసుకుంటాడు. 2027, డిసెంబర్ 31వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు.


Also Read: Ravi Shastri: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, రోహిత్ శర్మతో ఏకీభవించను: రవిశాస్త్రి

జులై నుంచి టీమిండియా- శ్రీలంకల మధ్య టెస్టు సిరీస్‌ మొదలుకానుంది. అక్కడి నుంచి కొత్త కోచ్ బాధ్యతలు తీసుకుంటాడు. దీని తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లు వున్నాయి. తర్వాత ఆస్ట్రేలియా టూర్ ఉండబోతోంది. 2025 ఏడాదిలో దాయాది దేశం పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోపీ ఆడాల్సి ఉంటుంది. 2026లో ఇండియా, శ్రీలంక దేశాలు టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరుసటి ఏడాది అంటే 2027లో సౌతాఫ్రికా వేదికగా వన్డే కప్ టోర్నమెంట్ ఉండనుంది. అప్పటివరకు కొత్త కోచ్ అందుబాటులో ఉంటాడన్నమాట.

టీమిండియా కొత్త కోచ్‌గా వచ్చేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుంచి చాలామంది మాజీలు ఆరాట పడుతున్నారు. కొంతమంది టీమిండియాకు కోచ్‌గా రావాలని ఉందనే విషయాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో చాలామంది మాజీలు తమ మనసులోని మాటను బయటపెట్టారు. విదేశీ మాజీ ఆటగాళ్లు బీసీసీఐని సంప్రదించినట్టు వార్తలు కూడా లేకపోలేదు. రాబోయే మూడేళ్లలో టీమిండియా షెడ్యూల్ బట్టి కోచ్‌ను ఎంపిక చేసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల కంటే విదేశీ మ్యాచ్ ఎక్కువగా ఉంటే వారినే తీసుకోవచ్చన్న వాదన కూడా లేకపోలేదు.

Also Read: ప్లే ఆఫ్ రేస్ నుంచి గుజరాత్ అవుట్.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు..

మరోవైపు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నా యి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పిచ్‌లపై ఆడిన అనుభవం ఆయన సొంతం. నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్ గా ఉన్నాడు. గతంలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌కు కోచ్‌గా వ్యవహరించాడు కూడా. మరి బీసీసీఐ ప్యానెల్ కమిటీ ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

Tags

Related News

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Big Stories

×