Big Stories

Ravi Shastri on Impact Rule: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. రోహిత్ శర్మతో ఏకీభవించను: రవిశాస్త్రి!

Ravi Shastri Comments on Impact Player Rule in IPL 2024: ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ ఎన్నో వివాదాలకు, సంచలనాలకు తెరతీసింది. అందులో ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్. ఈ నిబంధన పెట్టిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. వరుసగా నాలుగు వికెట్లు అయిపోతే, ఐదో బ్యాటర్ గా ఇంపాక్ట్ ప్లేయర్ రావడం, ప్రత్యర్థులు భారీ స్కోరు సాధిస్తే, ఇంపాక్ట్ బౌలర్ ని ప్రత్యర్థులు తీసుకురావడం, అంటే ఈ విధానం ఆటలో సమతుల్యతను దెబ్బతీసిందనే విమర్శలు మిన్నంటాయి. ఈ పద్ధతి బాగుందని అనేవారు కూడా ఉన్నారు.

- Advertisement -

ఇక విషయానికి వస్తే ఇంపాక్ట్ రూల్ వల్ల ఆల్ రౌండర్లకి నష్టం జరుగుతుందని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనడం పెద్ద దుమారాన్ని రేపింది. అయితే తనకి అనుకూలంగా మాట్లాడేవారు కొందరైతే, లేదు ఇంపాక్ట్ రూల్ ఉండాల్సిందేనని రవిశాస్త్రిలాంటి సీనియర్ ఆటగాడు అనడం నెట్టింట వేడి పుట్టించింది.

- Advertisement -

ఏళ్ల తరబడి ఒకటే తరహా క్రికెట్ ఆడి, ఆడి, చూసి చూసి బోర్ కొడుతోంది. ఆటలో మార్పులు వచ్చినప్పుడు ఇంట్రస్ట్ పెరుగుతుంది. లేదంటే క్రికెట్ కి దీర్ఘకాల ఆదరణ ఉండదు. కాలంతో పాటు మనం కూడా మారాలని రవిశాస్త్రి అన్నాడు. ఈ విషయంలో రవిచంద్రన్ అశ్విన్ కూడా మాట్లాడుతూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మంచిదేనని తెలిపాడు. పరిస్థితిని బట్టి జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఉంటుందని అన్నాడు.

Also Read: టీ 20 ప్రపంచకప్.. సత్తా చాటింది.. ఐదుగురు మాత్రమే..

మరోవైపు ఈ నిబంధనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ శాశ్వతం కాదని అన్నాడు. టోర్నీ తర్వాత దీనిపై రివ్యూ చేస్తామని తెలిపాడు. అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటామని అన్నాడు. క్రికెట్ కి నష్టం జరుగుతుందని తెలిస్తే, సమస్యే లేదు, కచ్చితంగా తీసి పక్కన పెట్టేస్తామని తెలిపారు.

అయితే రోహిత్ శర్మ ఏం అంటాడంటే, ప్రతి జట్టులో ఆల్ రౌండర్స్ ఉండేవారు. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రావడం వల్ల అటు బ్యాటర్ లేదా బౌలరు వస్తున్నారు. దీనివల్ల ఆల్ రౌండర్స్ అంతరించిపోతారని అన్నాడు. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి మాట్లాడుతూ రోహిత్ చెప్పిన విషయంతో ఏకీభవించడం లేదని తెలిపాడు.

Also Read: RCB vs CSK IPL 2024: ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌కు వరుణ గండం.. బెంగళూరు ఆశలపై నీళ్లు..?

ఇప్పుడు ఇదొకటే సమస్య కాదు. బౌలర్లని కాపాడాలని అంటున్నారు. బౌండరీ లైన్లు చిన్నవి చేసి, పవర్ ప్లే ఓవర్లు 6 ఇచ్చి బౌలర్ల జీవితాలతో ఆటలాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇలా ఐపీఎల్ సీజన్ రకరకాల తలనొప్పుల మధ్య అలా అలా సాగిపోతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News