BCCI on Indian Team Coach: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో.. రోహిత్ సేనకు ( Rohit sharma ) ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్ లో… టీమిండియా ( Team india) అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఆడిన 3 టెస్టుల్లోను ఓడిపోయి… వైట్ వాష్ కు గురైంది టీం ఇండియా. ఇలా జరగడం దాదాపు 12 సంవత్సరాల తర్వాత కావడం గమనార్హం. అంతేకాదు… భారత గడ్డపై… టీమిండియా ఓడిపోవడం కూడా చాలా రోజుల తర్వాత జరిగింది.
Also Read: Hardik – Axar: జాతీయ గీతాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ !
Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!
అయితే టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే టీమిండియా కు ముగ్గురు హెడ్ కోచ్లను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రస్తుతం టీమిండియా కు ఒక్క హెడ్ కోచ్ మాత్రమే ఉన్నాడు. అతను కూడా గౌతమ్ గంభీరే.
Also Read: Rinku Singh: ఐపీఎల్ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !
వాస్తవంగా… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ బరిలో ఉండాలంటే టీమిండియా కనీసం నాలుగు టెస్టు మ్యాచ్లు గెలవాలి. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడబోతుంది టీమిండియా. ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్లు గెలవడం చాలా కష్టం. కచ్చితంగా అందులో రెండు లేదా మూడు టెస్టులు ఉంటాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డపైన… పరిస్థితులు వేరుగా ఉంటాయి.
Also Read: South Africa vs India, 1st T20I: రేపటి నుంచే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?
టీమిండియా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా పిచ్ లను అర్థం చేసుకునేసరికి మూడు టెస్టులు అయిపోతాయి. అయితే… ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో టీమిండియా గనుక ఓడిపోతే…. ముగ్గురు హెడ్ కోచులను రంగంలోకి దింపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట. వన్డే క్రికెట్ ఫార్మాట్ కు ఒక హెడ్ కోచ్, టి20 అలాగే టెస్ట్ మ్యాచ్లకు కూడా… వేరువేరుగా మరో ఇద్దరిని తీసుకోవాలని అనుకుంటున్నారట.
అంటే ఒక్కో ఫార్మాట్కు ఒక్కో హెడ్ కోచ్ ఉంటాడు. ఇలా జరిగితే ముగ్గురు కోచ్ లు వస్తారు టీమిండియాకు! అయితే ఆస్ట్రేలియా జట్టు పైన ఓడిపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇది ఇలా ఉండగా… న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినందుకుగాను గౌతమ్ గంభీర్ పైన… చాలా సీరియస్ గా ఉందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆయనకు ప్రత్యేక క్లాస్ కూడా పీకిందట.