RCB VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మొదటి క్వాలిఫైయర్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కాబోతోంది. చండీగర్ లోని ముల్లాన్పూర్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ALSO READ: Vigilance on HCA : SRH ఓనర్ కావ్య పాప కొంప ముంచిన HCA… బెదిరింపులు చేసి మరి!
వణికి పోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ లో ఆడబోయే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గజగజ వనికి పోతోంది. గత 9 సంవత్సరాల కిందట ఇదే ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాడు బెన్ కటింగ్ బెంగళూరుకు పీడకల మిగిల్చాడు. గెలుస్తుంది అన్న క్రమంలో… బెంగళూరు ఆశలను చంపేశాడు బెన్ కటింగ్. ఈ దెబ్బకు సన్రైజర్స్ హైదరాబాద్ మొదటిసారి ఛాంపియన్ గా నిలిచింది. బెంగళూరు ఇంటికి వెళ్ళింది.
బెన్ కట్టింగ్ స్థానంలో మార్కస్ స్టోయినిస్ వస్తున్నాడు
9 సంవత్సరాల కిందట బెన్ కటింగ్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చుక్కలు చూపిస్తే.. ఇప్పుడు అతని స్థానంలో మార్కస్ స్టోయినిస్ వస్తున్నాడు. ఇతను కూడా అచ్చం బెన్ కటింగ్ లాగానే ఉంటాడు. ఆస్ట్రేలియాకు చెందిన వాడే కావడం గమనార్హం. అయితే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాడు మార్కస్ స్టోయినిస్. అతను ఆల్రౌండర్. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగల వీరుడు. ఇక ఇవాల్టి మ్యాచ్లో మార్కస్ స్టోయినిస్ అదరగొడితే.. బెంగళూరు ఓడిపోవడం గ్యారంటీ అని చెబుతున్నారు. దీంతో బెంగుళూరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
పంజాబ్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ కు వర్షం గండం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ జరిగే క్వాలిఫైయర్ మ్యాచ్కు వర్షం అడ్డంకి గా మారే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు గానీ వర్షం మాత్రం పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ వర్షం పడి పూర్తిగా మ్యాచ్ రద్దు అయితే కచ్చితంగా పంజాబ్ కింగ్స్ నేరుగా ఫైనల్ కి వెళుతుంది. పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉన్న నేపథ్యంలో పంజాబ్ కు ఆ అవకాశం ఉంటుంది
పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ XI: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వ్యషాక్/యుజ్వేంద్ర సింగ్/యుజ్వేంద్ర సింగ్ చాహల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ XI: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, మయాంక్ అగర్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ ( C), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషార/జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
Also Read: Kohli – Anushka: గ్రౌండ్ లోనే రొ**మాన్స్.. కోహ్లీకి ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ అనుష్క రచ్చ