Kohli – Anushka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా తాజాగా లక్నో వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( LSG vs RCB IPL 2025 Match 70) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… నేరుగా క్వాలిఫైయర్ వన్ లోకి దూసుకు వెళ్ళింది. అయితే లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన లక్నో పైన గెలిచిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఫుల్ జోష్లో కనిపించారు. నిజంగానే కప్పు వచ్చినంత ఫీల్ అవుతున్నారు.
ALSO READ: Vigilance on HCA : SRH ఓనర్ కావ్య పాప కొంప ముంచిన HCA… బెదిరింపులు చేసి మరి!
కోహ్లీకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన అనుష్క శర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో లక్నోపై విజయం సాధించిన తర్వాత… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ లందరూ గ్రౌండ్ లో సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చి గ్రౌండ్లో సరదాగా ఎంజాయ్ చేశాడు. అటు ప్రత్యర్థి ప్లేయర్లను కలిసి సందడి చేశాడు. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ లో నుంచి… గ్యాలరీలో ఉన్న అనుష్క శర్మకు సైగలు చేశాడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన అనుష్క శర్మ… అదిరిపోయే పని చేసింది. విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంటే… దానికి బదులుగా ఆమె కూడా… ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటో అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
ఇక వీరిద్దరి మధ్య జరిగిన ఈ సన్నివేశాన్ని చూసి… క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి… ఇతరులు కూడా కుళ్లుకునేలాగా… గ్రౌండ్ లోనే… ఎంజాయ్ చేస్తున్నారు అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. సాధారణంగా విరాట్ కోహ్లీ ( Virat Kohli )అలాగే అనుష్క శర్మ ( heroin Anushka Sharma) మధ్య ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి కాస్త కొత్తగా ఉంది. ఎందుకంటే క్వాలిఫైయర్ వన్ లోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వెళ్లడమే. 18 సంవత్సరాలుగా… టైటిల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) జట్టు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్వాలిఫైయర్ వన్ లోకి ( Qualifier 1) దూసుకు వెళ్ళింది.
క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఎవరితో అంటే?
క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Royal Challengers Bangalore vs Punjab Kings ) రెండు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ చండీఘర్ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి.. వెళ్తుంది. ఓడిన టీం… ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో.. తల పడుతుంది.
ALSO READ: Pant Mad Celebrations: రిషబ్ పంత్ సెంచరీ..గ్రౌండ్ లోనే సర్కస్.. గంగలో కలిసిన RCB ఆశలు
The Winning Shot to Enter Qualifier 1 (Top 2) for RCB from Virat Kohli to Anushka Sharma ❤️❤️
Mayank Agrawal, Jitesh Sharma, Rishabh Pant & Digvesh Rathi all played well but we are ready for
PBKS vs RCB
Not out
Mankad pic.twitter.com/qhc6V9Ytdk— Shruti Singh (@Shruti_Singh143) May 27, 2025