E-Paper
Advertisement

Ben Stokes VS Jofra Archer: ఇంగ్లాండ్ కొంప‌ముంచిన‌ యాషెస్‌ సిరీస్‌..గ్రౌండ్ లో త‌న్నుకున్న ఆర్చ‌ర్‌, స్టోక్స్ !

Ben Stokes VS Jofra Archer: ఇంగ్లాండ్ కొంప‌ముంచిన‌ యాషెస్‌ సిరీస్‌..గ్రౌండ్ లో త‌న్నుకున్న ఆర్చ‌ర్‌, స్టోక్స్ !
Advertisement

Ben Stokes VS Jofra Archer: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం యాషెస్‌ సిరీస్ 2025 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో భాగంగా రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ రెండవ రోజు అరుదైన సంఘటన జరిగింది. ఇంగ్లాండ్ ప్లేయర్ల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ కొట్టుకునేంత పని చేశారు. అయితే ఇంగ్లాండ్ లోని ఇతర ప్లేయర్లు ఈ గొడవలో జోక్యం చేసుకోవడంతో కాస్త‌ చల్లబడ్డారు. దీంతో జోఫ్రా ఆర్చర్, స్టోక్స్ గొడ‌వ వైర‌ల్ గా మారింది.

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

బెన్ స్టోక్స్‌ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ మధ్య గొడవ ఏంటి

Advertisement

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వర్సెస్ ఆ జట్టుకు సంబంధించిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టైయిలెండ‌ర్లను ఔట్ చేసే క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లు విఫలమయ్యారు. మిచెల్ స్టార్క్ అర్థ సెంచరీ కూడా సాధించాడు. అయితే ఆస్ట్రేలియా టైయిలండ‌ర్ల‌ను ఔట్ చేసేందుకు, స్టంప్స్ పైన బౌలింగ్ చేయమని జోఫ్రా ఆర్చర్ ను స్టోక్స్ కోరుతాడు. కానీ స్టోక్స్ చెప్పినట్లు జోఫ్రా ఆర్చర్ అస్సలు ఫాలో కాలేదు. తన స్టైల్లో బౌలింగ్ చేసాడు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ బెన్ స్టోక్స్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నేను చెప్పినట్టు ఎందుకు బౌలింగ్ చేయడం లేదని గ్రౌండ్ లోనే జోఫ్రా ఆర్చర్ ను స్టోక్స్ నిలదీశాడు. అయితే స్టోక్స్ బెదిరించగానే అస్సలు భయపడని జోఫ్రా ఆర్చర్ ఎదురు తిరిగాడు. నేను కరెక్ట్ గానే బౌలింగ్ చేస్తున్నాను అంటూ బదులిచ్చాడు. ఇక అదే కోపంతో మిచెల్ స్టార్క్‌ వికెట్ పడగొట్టాడు జోఫ్రా ఆర్చర్. దీంతో చెంప చెల్లుమనేలా బెన్ స్టోక్స్ కు ఆన్సర్ ఇచ్చాడు జోఫ్రా ఆర్చర్. అయితే మిచెల్ స్టార్క్ వికెట్ పడ్డ తర్వాత జోఫ్రా ఆర్చర్, స్టోక్స్‌ ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.

జట్టును ఆదుకుంటున్న జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్

యాషెస్‌ సిరీస్ మూడవ టెస్ట్ లో 371 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఇక మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్, రెండో రోజు ముగిసే సమయానికి 68 ఓవర్లు ఆడి 213 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే బౌలింగ్ చేసే క్రమంలో గొడవ పెట్టుకున్న స్టోక్స్ అలాగే జోఫ్రా ఆర్చర్ ఇద్దరు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. తమ గొడవలను పక్కకు పెట్టి, మంచి భాగస్వామ్యాన్ని ఇంగ్లండ్ జ‌ట్టుకు అందిస్తున్నారు. బెన్ స్టోక్స్‌ ఇప్పటి వరకు 45 పరుగులు సాధించగా అటు జోఫ్రా ఆర్చర్ 30 పరుగులతో దుమ్ము లేపాడు. రేపు కూడా వీళ్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరు క‌లిసి క‌ట్టుగా బ్యాటింగ్ చేసిన‌ నేపథ్యంలో గొడవ మొత్తం సైడ్ అయిపోయింది.

Advertisement

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×