Sarangapani Jathakam Trailer : ప్రియదర్శి (Priyadarshi), రూప కొడువాయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam). దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందంటే?
సారంగపాణి తంటాలు ఫన్నీగా…
‘సారంగపాణి జాతకం’ సినిమా ఒక క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. అదే విషయాన్ని మేకర్స్ ట్రైలర్ ద్వారా స్పష్టంగా వెల్లడించారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి గతంలో ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన చిత్రాలను తీశారు. ఇప్పుడు జానర్ మార్చి ఆయన కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ ‘సారంగపాణి’ జాతకం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని, కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తెరకెక్కిస్తున్నామని ఇప్పటికే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ లో పేర్కొన్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘సారంగపాణి జాతకం’ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కట్ కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ను హైలైట్ చేసేలా ఉంది. ప్రియదర్శి కామెడీ టైమింగ్ కు వెన్నెల కిశోర్, వైవా హర్ష వంటి కమెడియన్లు యాడ్ కావడంతో ట్రైలర్ మొత్తం ఫన్నీగా సాగింది. ఓవైపు జాతకం పిచ్చి, మరోవైపు ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి కల, అంతలోనే తలపై పడే ఓ క్రైమ్… వీటన్నింటి మధ్య హీరో నలిగిపోవడమే కాకుండా, ఆయన ఫ్రెండ్స్ కూడా చిక్కుకోవడం ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంది. “అన్నీ నువ్వే చేసుకోవడానికి ఇదేమీ హస్త**ప్రయోగం కాదు.. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాకుండా టచ్ చేశావురా” వంటి హిలేరియస్ డైలాగ్స్ యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచే విధంగానే ఉంది. మరి ఆ అంచనాలను సారంగపాణి ఎంత వరకు అందుకుంటాడు అన్నది దర్శకుడు ఇంద్రగంటి స్టోరీ టెల్లింగ్‌పై, స్క్రీన్ ప్లేపై ఆధారపడి ఉంటుంది.
Read Also : క్రికెట్ కింగ్ ధోనీతో గ్లోబల్ స్టార్… ‘పెద్ది’ కోసం మాత్రం కాదండోయ్
మూవీకి అదే ప్లస్ కానుందా?
ప్రియదర్శి ఇటీవలే నాని నిర్మించిన ‘కోర్టు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నెక్స్ట్ ఆయన నుంచి వస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రియదర్శి పడుతున్న కష్టం మామూలుగా లేదు. ‘కోర్టు’ మూవీ సక్సెస్ ను, ఇటీవల జరిగిన పికిల్స్ వివాదాన్ని ప్రమోషన్ల కోసం వాదేశాడు. అయినప్పటికీ సినిమాపై అంచనాలు పెద్దగా పెరగలేదు. కానీ ట్రైలర్ ను మాత్రం మూవీలో కావలసినంత ఫన్ ఉంటుందని, కామెడీ ఎంటర్టైనర్లను ఇష్టపడే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా కట్ చేశారు. థియేటర్లలో మూవీకి గనుక పాజిటివ్ టాక్ వస్తే, ఇదే లోబజ్ సారంగపాణికి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. పైగా ట్రైలర్ లో వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ టైమింగ్ కూడా బాగుంది. మరి ఈ మూవీకి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా వెయిట్ అండ్ సీ.