Sarfaraz Ahmed On PAK VS WI: పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ మళ్లీ ఇరగదీస్తోంది. బాబర్ ఆజంకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత పాకిస్తాన్ మళ్లీ విజయాల బాట పట్టింది. వెస్టిండీస్ పై మొదటి టెస్ట్ లో ఓడిపోయిన పాకిస్తాన్…. రెండో టెస్టులో మాత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. రెండో టెస్టులో వెస్టిండీస్ పై ( PAK VS WI) ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ సమం చేసింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. అయితే పాకిస్తాన్ నిన్నటి మ్యాచ్ విజయం సాధించిన నేపథ్యంలో కోచ్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ ( Sarfaraz Ahmed ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క మ్యాచ్ గెలవగానే కొమ్ములు వచ్చినట్లుగా షాకింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. త్వరలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (World Test Championship) టైటిల్ కూడా గెలుస్తామని ప్రకటించారు.
వెస్టిండీస్ పై రెండో మ్యాచ్ లో విజయం సాధించిన పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు…ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ టెస్ట్ జట్టు ప్రస్తుతం చాలా బలంగా ఉందని… బాబర్ ఆజం కెప్టెన్సీలో ముందుకు దూసుకు వెళ్తోందని ప్రకటించారు. అందుకే విదేశీ గడ్డపై వెస్టిండీస్ లాంటి బలమైన జట్టును ఓడించామని వెల్లడించారు. తమ తదుపరి ప్రధాన లక్ష్యం ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలవడమేనని స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లా మీద ఒట్టేసి చెబుతున్నా… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచే వరకు తాను నిద్రపోనని.. పాకిస్తాన్ క్రికెటర్లను కూడా పడుకోనివ్వ బోనంటూ సవాల్ విసిరారు.
ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవకపోతే తాను రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. ఇకపై పాకిస్తాన్ 2.0 వెర్షన్ చూస్తారని వెల్లడించారు. అయితే సర్పరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఒరేయ్ మీరు గెలిచింది ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్.. దీంతో సిరీస్ డ్రా చేసుకున్నారు తప్ప… గెలవలేదని గుర్తుపెట్టుకోండి అంటూ హేళన చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ గెలిచినంత సంబరపడిపోతున్నారు… ఇంత ఓవరాక్షన్ చేస్తే మళ్లీ అమాంతం పడిపోతారని హెచ్చరిస్తున్నారు కోచ్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ ( Sarfaraz Ahmed ).
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2026-27 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. నిన్న వెస్టిండీస్పై విజయం సాధించినప్పటికీ పాయింట్లు పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా కొనసాగుతున్నాయి. సర్ఫరాజ్ అహ్మద్ చెప్పినట్లుగా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాకిస్తాన్ సొంతం చేసుకోవడం కష్టమే. ప్రస్తుత పరిస్థితులలో 8వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఒకటి లేదా రెండవ స్థానాలకు రావడం అసాధ్యమే. ఐదవ స్థానంలో ఉన్న టీమిండియాకే ఈ ఛాన్స్ లేనప్పుడు… పాకిస్తాన్ కు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. 8వ స్థానంలో ఉన్న జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిస్తే పెద్ద చరిత్ర అంటున్నారు.