YCP flags: బీఆర్ఎస్ పార్టీ స్థాపించి నేటికి 25 ఏళ్లు. ఈ క్రమంలోనే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. సభకు ఎడ్లబండ్లు, ఆటోలు, బస్సులు, జీపుల్లో లక్షలాది మంది తరలివచ్చారు.
అయితే, వరంగల్ నగరం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలు పట్టుకుని సభకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే గులాబీ జెండాల మధ్యలో వైఎస్సార్‌సీపీ జెండాలు వెలిశాయి. ఏపీ నుంచి వైసీీపీ కార్యకర్తలు వచ్చారా..? లేదా.. స్థానిక వరంగల్ జిల్లా నాయకులే వైసీపీ జెండాలు పట్టుకున్నారా..? అనేది తెలియదు. కానీ.. కొందరు అయితే వైసీీపీ జెండాలు భారీ ఎత్తున పట్టుకుని సభకు హాజరయ్యేందుకు వచ్చారు. రెండు పార్టీల జెండాలను పట్టుకొని జై జగన్.. జై కేసీఆర్ అంటూ నినదించారు.
అయితే ఈ వీడియో.. ఇప్పటిదా..? పాతదా..? అనేది కచ్చితంగా తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇదిగో వీడియో..
🤡🤡 ఊర్లో పెళ్ళికి కుక్కలు హడవిడి మాదిరి వరంగల్లో బిహారి రంఢగాళ్ళ తాగుబోతుల కఛేరిలో (తాగుదాం ఊగుదాం) తినిపడేసిన బొక్కలకోసం వెళ్తున్న పేటియం కుక్కలు 🐕🐕 @YSRCParty @JaganannaCNCTS @JAGANANNAMEDIA 🤡🤡 pic.twitter.com/N7LmbN5N9x
— సైకిల్ రాజా✌️ (@RythuBiddaOnX) April 27, 2025
ALSO READ: KCR Speech: మళ్లోచ్చేది బరాబర్ నేనే చూసుకోండ్రి.. కేసీఆర్ ఊరమాస్ స్పీచ్..
అయితే, బీఆర్ఎస్ రజతోత్సవ సభ రోజు.. గులాబీ జెండాల మధ్య వైసీపీ జెండాలు ప్రత్యక్షం కావడంతో.. సోషల్ మీడియా వేదికగా పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్, వైసీపీ రెండు మిత్ర పార్టీలు అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి కొందరేమో.. కేసీఆర్ పై అభిమానంతో ఏపీ నుంచి వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారేమో అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ALSO READ: KCR: సీఎం లేదు.. పాడు లేదు ఏ గమ్మునుండు.. వీడు మనోడేనా.. కేసీఆర్ అసహనం