IPL 2025: మరో నాలుగు రోజులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ ప్రారంభం కాబోతోంది. మార్చ్ 22న కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగబోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడబోతోంది. ఈ సీజన్ కోసం క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అన్ని జట్లు సైతం ప్రాక్టీస్ సెషన్లని ప్రారంభించాయి. ఈ సీజన్ లో టైటిల్ విజేతగా నిలవాలని ఆరాటపడుతున్నాయి.
Also Read: Ms Dhoni: వాళ్ల బౌలింగ్ లో బ్యాటింగ్ చేయలేను.. ధోని షాకింగ్ కామెంట్స్
ఇప్పటికే చాలామంది అభిమానులు టికెట్స్ కూడా బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు. ఐపీఎల్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ చూసుకుంటూ.. ఈసారి సీజన్ ఫైట్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ తెగ ఎక్సైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రతి సంవత్సరం లాగే.. ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ నిర్వహకులు ప్రారంభ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తొలి మ్యాచ్ కి ముందు ఐపీఎల్ ప్రారంభోత్సవం వేడుకని కళ్ళు చెదిరేలా నిర్వహించనున్నారు.
ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ఏ ప్రముఖులు ప్రదర్శన ఇస్తారో తెలిపారు నిర్వాహకులు. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ప్రారంభానికి ముందు దేశవ్యాప్తంగా, విదేశాల నుండి స్టార్ కళాకారులను బిసిసిఐ ఆహ్వానిస్తుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు అభిమానులకు వినోదాన్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా బాలీవుడ్ స్టార్ నటి దిశా పటాని, ప్రముఖ నేపథ్య గాయని శ్రేయ ఘోషల్, పంజాబీ గాయకుడు కరణ్ జౌజ్లా, వరుణ్ ధావన్ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ స్టార్ ప్రదర్శనలతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించబోతోంది బిసిసిఐ. కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో తొలి రోజు మ్యాచ్ 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ప్రారంభోత్సవం రోజు సాయంత్రం 6 గంటలకు ఈ ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇక ఈ తొలి మ్యాచ్ టికెట్లు ఇప్పటికే ఆన్లైన్ లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. రెండు నెలల పాటు సాగనున్న ఈ ఐపీఎల్ పోటీలు మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తాయి.
Also Read: IPL 2025: జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. ఇక ఫ్యాన్స్ కు జాతరే ?
ఇప్పటివరకు ముంబై, చెన్నై జట్లు అత్యధికంగా చెరో ఐదుసార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచాయి. ఆ తరువాత మూడుసార్లు కలకత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఇక ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో తలపడనున్న ఆర్సిబి, కేకేఆర్.. గత ఎడిషన్ లో రెండు సార్లు తెలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్లలోనూ కలకత్తా గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆర్సిబి గత సంవత్సరం ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుండగా.. కలకత్తా తమ విజయపరంపరను కొనసాగించాలని ఆశతో ఉంది.