IPL 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 tournament ) ఇటీవల పూర్తయిన నేపథ్యంలో అందరి దృష్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 పైన ( Indian Premier League 2025 ) పడింది. మరో నాలుగు రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో.. ఈ మ్యాచ్ లు ఎప్పుడు ప్రారంభం అవుతాయని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎండాకాలం కావడంతో… విద్యార్థులు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఓ వింత ప్రశ్న వైరల్ అవుతుంది.
Also Read: Anushka Sharma: భార్య భర్తలను విడగొడతారా? BCCI రూల్స్ పై అనుష్క శర్మ ఫైర్ ?
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ( SRH)… గతంలో కంటే ఈసారి మరింత బలంగా తయారైంది. ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్ లాంటి తోపు ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. అయితే బౌలర్ల విషయం పక్కకు పెడితే… బ్యాటింగ్ విభాగంలో కొత్తగా ఇషాన్ కిషన్ రంగంలోకి దిగబోతున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన ఇషాన్ కిషన్… అప్పుడు ఓపెనర్ గా దిగి సంచలనమే సృష్టించాడు. ముంబై సక్సెస్ రేట్ లో అతని ఓపెనింగ్ బ్యాటింగ్ చాలా కీలకం.
అయితే ఇప్పుడు హైదరాబాద్ జట్టులోకి వచ్చిన తర్వాత… ఇషాన్ కిషన్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అనే దానిపైన.. అందరూ చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ జట్టులో ఇప్పటికే భయంకరమైన ఓపెనర్లు ఉన్నారు. ట్రావిస్ హెడ్ తో పాటు అభిషేక్ శర్మ… ఇద్దరు హైదరాబాద్ జట్టుకు భయంకరమైన ఓపెనర్లు. వీళ్ళు నిలబడితే… 200 పరుగుల వరకు వికెట్ నష్టపోకుండా కొడతారు. 20 ఓవర్ల వరకు వీళ్ళిద్దరూ అవుట్ కాకపోతే… 300 కూడా కొట్టేస్తారు.
మొదటి బంతి నుంచి… విరుచుకుపడుతూ… బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉంటారు హెడ్, అభిషేక్ శర్మ. అయితే.. ఇప్పుడు ఇషాన్ కిషన్ వచ్చాడు కాబట్టి.. అతన్ని ఓపెనర్ గా దించుతారని చెబుతున్నారు. దానివల్ల హెడ్ పై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. హెడ్ ను ఫస్ట్ డౌన్ లో దింపే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఓపెనర్ గా తప్ప ఇషాన్ కిషన్ ఏ స్థానంలో కూడా పెద్దగా రాణించడని రికార్డులు చెబుతున్నాయి.
Also Read: Ms Dhoni: వాళ్ల బౌలింగ్ లో బ్యాటింగ్ చేయలేను.. ధోని షాకింగ్ కామెంట్స్
అందుకే అతనికి ఓపెనర్ గా అవకాశం ఇస్తారని ఈ సమాచారం. అదే హెడ్ (Travis head ) మాత్రం ఏ స్థానంలో అయినా… ఆడగల సత్తా ఉన్న ప్లేయర్. కానీ… హెడ్ అలాగే అభిషేక్ శర్మ జంటను విడగొట్టకూడదని… హైదరాబాద్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆ జంటను విడగొడితే హైదరాబాద్.. దారుణంగా ఓడిపోతుందని కూడా చెబుతున్నారు. దీంతో ఈశాన్ కిషన్ కారణంగా…. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో.. పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మార్చి 23వ తేదీన హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్యాహ్నం రెండో మ్యాచ్ జరగనుంది.