BigTV English

Kaushik Reddy Meets SKY: ముంబై ప్లేయర్లకు దావత్ ఇచ్చిన BRS ఎమ్యెల్యే !

Kaushik Reddy Meets SKY: ముంబై ప్లేయర్లకు దావత్ ఇచ్చిన BRS ఎమ్యెల్యే !

Kaushik Reddy Meets SKY:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… బుధవారం రోజున సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన ముంబై ఇండియన్స్ ఏకంగా 7 వికెట్ల తేడాతో.. హైదరాబాద్ జట్టు పైన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన బయటకు వచ్చింది. ముంబై ఇండియన్స్ ప్లేయర్లను.. గులాబీ పార్టీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. ఆయన ఒక్కడే కాకుండా తన కుటుంబాన్ని మొత్తం తీసుకువెళ్లి ముంబైలో కలవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Also Read: Rohit Sharma :హైదరాబాద్ మెట్రోలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ రచ్చ…హిట్ మ్యాన్ అంటూ

ముంబై ప్లేయర్లకు దావత్ ఇచ్చిన కౌశిక్ రెడ్డి


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్లు దిగారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు. ఇవాళ సాయంత్రం హైదరాబాదు నుంచి… ముంబై ఇండియన్స్ ప్లేయర్లు వెళ్లిపోతారు. అయితే ఇవాళ ఉదయం పూట… ముంబై ఇండియన్స్ ప్లేయర్లను పాడి కౌశిక్ రెడ్డి కలవడం జరిగింది. ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఉంటున్న హోటల్ కి వెళ్లి… ముంబై ఇండియన్స్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్ అలాగే, తెలుగు కుర్రాడు తిలక్ వర్మాను కలిశాడు పాడి కౌశిక్ రెడ్డి.

తనతో పాటు తన కూతురు అలాగే భార్యను కూడా.. పాడి కౌశిక్ రెడ్డి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా చిన్న డిన్నర్ కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ ప్లేయర్లను కలిసి నట్టు… స్వయంగా పాడి కౌశిక్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ముంబై ప్లేయర్లు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో… సూర్య కుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ లను తన కుటుంబం కలిసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నాడు హుజురాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇక ఈ సందర్భంగా… పాడి కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనికారెడ్డికి…. ఓ అదిరిపోయే టీషర్ట్ కూడా గిఫ్ట్ ఇచ్చారు ముంబై ప్లేయర్లు.

Also Read: Threat to Gambhir: గంభీర్‌ కు బిగ్ షాక్.. ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు

దీనిపై వారిద్దరి ఆటోగ్రాఫ్ చేసి మరి పాడి కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక రెడ్డికి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక…. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన గుజరాత్ మ్యాచ్ సందర్భంగా కూడా… గిల్ అలాగే మహమ్మద్ సిరాజులను పాడి కౌశిక్ రెడ్డి కలవడం జరిగింది. గతంలో రంజి ప్లేయర్ గా పాడి కౌశిక్ రెడ్డి కొనసాగారు. అందుకే హైదరాబాద్ తరఫున ఆడిన టీమిండియా ప్లేయర్ లందరూ తనకు టచ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా… ఐపీఎల్ ప్లేయర్లను కలుస్తూ ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి.

Related News

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

Big Stories

×