Telugu Warriors: ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Celebrity Cricket League )… తెలుగు వారియర్స్ ( Telugu Warriors ) మరో ఓటమి చదివి చూసింది. చెన్నై చేతిలో దారుణంగా ఓడిపోయింది తెలుగు వారియర్స్. హైదరాబాద్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన చెన్నై రైనోస్ ( Chennai Rhinos )… తెలుగు వారియర్స్ ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రూల్స్ తెలియకనా… లేదా మర్చిపోయారో తెలియదు కానీ… తెలుగు వారియర్స్ పెద్ద తప్పిదమే చేశారు. ఏకంగా 12 మందితో… తెలుగు వారియర్స్ ఫీల్డింగ్ చేసింది.
Also Read: MS Dhoni: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ధోని.. ఫోటోలు వైరల్ !
అయితే ఇది ముందుగా గమనించని చెన్నై … ఆ తర్వాత అయింది. దీంతో చెన్నై కెప్టెన్… రంగంలోకి దిగి మ్యాచ్ ను అడ్డుకున్నారు. దీంతో గ్రౌండ్ లో రచ్చ రచ్చ జరిగింది. లేదు 11 మంది ఉన్నారని తెలుగు వారియర్స్…. వాదించింది. లేదు మొత్తం 12 మంది ఫీల్డింగ్… గ్రౌండ్ లో… గొడవకు… దిగింది చెన్నై. అయితే తెలుగు వారియర్స్ అలాగే చెన్నై మధ్య గొడవ జరగడంతో…. మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. అయితే ఆ తర్వాత అంపైర్లు.. రంగంలోకి దిగి… లెక్క తేల్చారు. దీంతో తెలుగు వారియర్స్ బండారం బయటపడింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ మర్చిపోయి 12 మందిని రంగంలోకి దింపాడు. ఈ సంఘటన 9వ ఓవర్ సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో చెన్నై బ్యాటింగ్ చేస్తుంది. అయితే గొడవ తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ మ్యాజిక్ ప్రారంభమైంది. అయితే ఈ సంఘటన.. జరిగిన నేపథ్యంలో దాదాపు 15 నిమిషాల పాటు మ్యాచ్ ఆపేశారు. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్లో 25 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది చెన్నై. దీంతో రెండవ ఓటమి… తన ఖాతాలో వేసుకుంది ఈ తెలుగు వారియర్స్. మొదటి మ్యాచ్ లో కర్ణాటక చేతిలో ఓడిన.. తెలుగు వారియర్స్ ఇప్పుడు చెన్నై చేతిలో చిత్తు చిత్తు అయింది. ఇక ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే… ఈ మ్యాచ్ లో మొదట చెన్నై బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు నష్టపోయిన చెన్నై ఏకంగా 125 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో విక్రాంత్ 61 పరుగులు చేయగా దశరథి 35 పరుగులు చేసి రాణించారు. అటు మొదటి ఇన్నింగ్స్ లో తెలుగు వారియర్స్ బౌలర్ రఘు రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన తెలుగు వారియర్స్… 6 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే తెలుగు వారియర్స్ ఆటగాలలో రోషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 33 బంతుల్లో 72 పరుగులు తీసి దుమ్ము లేపాడు. అటు చెన్నై బౌలర్లలో చరణ్ మూడు వికెట్ పడగొట్టాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 20 పరుగుల లీడ్ సంపాదించింది చెన్నై. ఆ తర్వాత రెండవ ప్రారంభించిన చెన్నై… 87 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇక ఛేజింగ్ కు దిగిన తెలుగు వారియర్స్ 89 పరుగులకు.. ఆరు వికెట్లు నష్టపోయింది. అప్పటికే 10 ఓవర్ల కోటా ముగిసింది. దీంతో చెన్నై సూపర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
Also Read: Shoaib Akhtar on Laxmipati Balaji: అక్తర్ ను నరకం చూపించిన బౌలర్..కోపంతో బ్యాట్లు కూడా విరగొట్టాడు ?
Oreiii…12 mandi unnaru field lo..4 balls ayyakaaa gurtincharu…chusukovaliii kadha mundassss🤣🤣@TeluguWarriors1 @ccl #CCL2025 pic.twitter.com/z10VECFB4F
— SeshuDbuss (@SeshuDBuss) February 15, 2025