Chaiwala Dolly: డాలీ చాయ్ వాలా.. మీలో చాలామందికి ఈ పేరు గుర్తుండే ఉంటుంది. మహారాష్ట్రలోని నాగపూర్ కి చెందిన సునీల్ పాటిల్ అనే యువకుడు ఉపాధి కోసం ఓ “టీ” కొట్టు పెట్టుకున్నాడు. అతడి డ్రెస్సింగ్ స్టైల్, టీ తయారు చేసే విధానం, ఆ టీ కస్టమర్లకు అందించడంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ని అనుకరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు సునీల్ పాటిల్. “డాలీ చాయ్ వాల” అనే పేరుతో ఇంస్టాగ్రామ్ లో సెలబ్రిటీగా మారిపోయాడు.
Also Read: Virat Kohli: రంజీ మ్యాచ్ లు ఆడితే.. కోహ్లీకి ఎంత జీతం ఇస్తారు ?
ఇక ఇతను సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారడంతో నాగపూర్ లోని రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్డు మార్గంలో “డాలీ ఛాయ్ వాలా” బడ్డీ కొట్టు ఫేమస్ ప్లేస్ గా మారిపోయింది. అంతేకాదు అతడు కెటిఎమ్ బైక్ పై వచ్చి స్టైల్ గా టీ తయారు చేసే విధానాన్ని చూసేందుకు చాలామంది అక్కడికి వస్తుంటారు. అయితే 2024 ఫిబ్రవరిలో భారత్ పర్యటనకి వచ్చిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఈ డాలి చాయ్ వాలా దగ్గరికి వెళ్లి చాయ్ ని టేస్ట్ చేశారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
ఏక్ చాయ్ ప్లీజ్ అంటూ బిల్ గేట్స్ ఆర్డర్ చేయడంతో.. డాలీ చాయ్ వాలా ప్రత్యేకంగా టీ తయారుచేసి గాజు గ్లాసులో బిల్ గేట్స్ కి అందించాడు. ఇక ఆ చాయ్ తాగుతూ “చాయ్ పే చర్చ” కోసం ఎదురుచూస్తున్నానంటూ బిల్ గేట్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సునీల్ పాటిల్ మరింతగా ఫేమస్ అయిపోయాడు. అయితే తాజాగా ఇంటర్నేషనల్ లీగ్ టి-20 2025 సందర్భంగా పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. ఈ డాలీ చాయ్ వాలాను కలిశాడు.
ఇంటర్నేషనల్ టి-20 2025 టోర్నమెంట్ వ్యాఖ్యానాల అసైన్మెంట్ల కోసం యూఏఈ లో ఉన్న అక్తర్.. తన సోషల్ మీడియాలో డాలీతో ఉన్న వీడియోని పంచుకున్నాడు. భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్, షోయబ్ అక్తర్ లకు డాలి తన టీ ని రుచి చూపించాడు. అనంతరం ఈ వీడియోలో షోయబ్ అక్తర్.. డాలిని తన అభిమానులకు పరిచయం చేశాడు.
Also Read: Hardik Pandya: బలుపు అన్నారు కదరా… దుమ్ములేపి చూపించా !
ఈ సందర్భంగా నా మ్యాచ్ లని చూసావా..? అని డాలిని అడిగాడు. దీంతో చాలా చూశానని అతడు తెలిపాడు. ఆ తరువాత టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ని తాను అవుట్ చేసినప్పుడు నీకేమైనా బాధగా అనిపించిందా..? అని డాలిని ప్రశ్నించాడు. దీనికి డాలి.. ” మీరు ఓ గొప్ప బౌలర్. మీరు బ్యాటర్లకు బౌలింగ్ చేస్తున్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. బ్యాటర్ల పైకి మీరు బాంబులు విసురుతున్నట్లు అనిపించేది” అంటూ ఫన్నీగా సమాధానమిచ్చాడు. అనంతరం మీ టీ చాలా బాగుందని డాలికి కృతజ్ఞతలు తెలిపాడు అక్తర్. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Ran into Dolly Chaiwala at the stadium. What a lovely character with an inspiring story pic.twitter.com/W7lJ1Usefc
— Shoaib Akhtar (@shoaib100mph) January 31, 2025