Punjab kings Captains: 17 సీజన్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ అభిమానులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందజేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. 2008వ సంవత్సరం మార్చ్ లో మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ కావడంతో.. అప్పటినుండి మొదలైన ఈ ఐపీఎల్ సీజన్ ఇప్పటికీ 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రతి సంవత్సరం మార్చి నెల వస్తుందంటే క్రికెట్ అభిమానులకు పండగే.
ఆటగాళ్ల వేలం నుండి మొదలుకొని లీగ్ పూర్తయ్యే వరకు ఐపీఎల్ కి సంబంధించి ప్రతి వార్త ఆసక్తికరంగానే ఉంటుంది. మరికొద్ది రోజులలోనే 18వ సీజన్ కూడా మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువమంది కెప్టెన్లు మారిన జట్టుగా పంజాబ్ కింగ్స్ జట్టు నిలిచింది. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్పటివరకు 17 మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. ఐపీఎల్ స్టార్ట్ అయిన మొదటి సంవత్సరం 2008 – 09లో యువరాజ్ సింగ్ పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు.
ఇతని నాయకత్వంలో జట్టు 29 మ్యాచ్ లు ఆడి.. 17 మ్యాచ్ లు గెలుపొందింది. 12 మ్యాచ్ లు ఓడిపోయింది. ఆ తర్వాత 3వ సీజన్ 2010 లో సంఘర్కర జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. ఇతని కెప్టెన్సీలో 13 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కేవలం 3 మ్యాచ్ లలోనే గెలుపొంది.. 9 మ్యాచ్ లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా గా మిగిలింది. దీంతో ఈ 2010 సీజన్ లోనే అతడిని కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించి జయవర్ధనేకి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.
ఇతని కెప్టెన్సీలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన పంజాబ్ అది కూడా ఓడిపోయింది. అనంతరం గిల్ క్రిస్ట్ పంజాబ్ జట్టుకు నాలుగవ కెప్టెన్. ఇతడు 2011 నుండి 13 వరకు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇతని నాయకత్వంలో పంజాబ్ జట్టు 33 మ్యాచ్ లలో 17 మ్యాచ్ లలో గెలుపొంది.. మరో 17 మ్యాచ్ లలో ఓడిపోయింది. అనంతరం గిల్ క్రిస్ట్ తప్పుకోవడంతో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ హస్సి 2012 – 13 సీజన్లలో 12 మ్యాచ్ లకి నాయకత్వం వహించాడు.
ఈ 12 మ్యాచ్ లలో 6 ఓడిపోయి 6 మ్యాచ్ లు గెలుపొందింది. ఇతని తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ జార్జ్ బెయిలీ 2014-15లో సారథిగా వ్యవహరించాడు. ఇతని నాయకత్వంలో మొత్తం 35 మ్యాచ్ లలో 18 విజయాలు సాధించింది. 17 ఓటములు కూడా ఉన్నాయి. అయితే ఇతని కెప్టెన్సీలో 2014 లో పంజాబ్ తొలిసారి ఫైనల్ కీ చేరుకుంది. అనంతరం పంజాబ్ కి వీరేంద్ర సెహ్వాగ్ కూడా 2015 లో 1 మ్యాచ్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు.
Also Read: Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అతనే.. అధికారిక ప్రకటన వచ్చేసింది !
ఇలా చెప్పుకుంటూ పోతే పంజాబ్ జట్టుకి డేవిడ్ మిల్లర్, మురళి విజయ్, మ్యాక్స్ వెల్, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, శ్యామ్ కరణ్, జితేష్ మోహన్ శర్మ.. ఇలా 17 మంది పంజాబ్ జట్టుకి కెప్టెన్లుగా వ్యవహరించారు. సీజన్లు మారుతున్నాయి, కెప్టెన్లు మారుతున్నారు. కానీ పంజాబ్ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ఇక 2025 ఐపీఎల్ సీజన్ కి శ్రేయస్ అయ్యర్ ని పంజాబ్ జట్టు కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. ఇతని సారథ్యంలోనైనా జట్టు కప్ సాధిస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి.
Punjab Kings captains in IPL history:
1. Yuvraj.
2. Sangakkara.
3. Jayawardene.
4. Gilchrist.
5. David Hussey.
6. Bailey.
7. Sehwag.
8. Miller.
9. Murali Vijay.
10. Maxwell.
11. Ravi Ashwin.
12. KL Rahul.
13. Mayank.
14. Dhawan.
15. Sam Curran.
16. Jitesh.17. SHREYAS IYER..!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 13, 2025