T20 Player of the year: ఐసీసీ పురుషుల టి-20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2024 కి సంబంధించిన నామినీస్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ సంవత్సరం టి-20 ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు {T20 Player of the year} ఈ అవార్డు ఇస్తారు. ఈ క్రమంలోనే నలుగురు ఆటగాళ్లను షాట్ లిస్ట్ చేశారు. ఈ నలుగురు ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, భారత్, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేట్ అయ్యారు.
Aslo Read: ICC World Test Championship: WTCకి చేరిన దక్షిణాఫ్రికా… మరి టీమిండియా పరిస్థితి ఏంటి.. లెక్కలు ఇవే?
ఈ ఐసీసీ టి-20 ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాలో భారత జట్టు నుండి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అర్షదీప్ సింగ్ పేరు ఉంది. ఈ ఏడాది టీ-20 ల్లో అర్షదీప్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సంవత్సరం కేవలం 18 t-20 లు మాత్రమే ఆడిన అర్షదీప్ సింగ్.. 7.49 ఎకనామితో 36 వికెట్లు పడగొట్టాడు. టి-20 వరల్డ్ కప్ 2024 లోను అర్షదీప్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 8 మ్యాచ్ లలో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావీస్ హెడ్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది 15 టి-20 లు ఆడిన హెడ్ 539 పరుగులు చేశాడు. హెడ్ అత్యుత్తమ ఇన్నింగ్స్ 178.47 స్ట్రైక్ రేట్ తో 80 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే నుంచి డేంజర్ బ్యాట్స్మెన్ సికిందర్ రజా కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది 24 టి-20 మ్యాచ్ లు ఆడిన రజా.. 573 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 133 నాటౌట్ గా ఉంది. అంతేకాకుండా బౌలింగ్ తోను మ్యాజిక్ చేసి 24 వికెట్లు పడగొట్టాడు.
ఇక పాకిస్తాన్ జట్టు నుండి మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఈ ఏడాది 24 అంతర్జాతీయ టి-20 మ్యాచ్ లు ఆడి 738 పరుగులు చేశాడు. బాబర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ 75 నాట్ అవుట్ గా ఉంది. వీరిలో ఒకరికి ఈ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించనుంది. ఇక ఉమెన్ క్రికెటర్లలో భారత్ నుంచి ఎవరికి అవకాశం దక్కలేదు. చమరి ఆటపట్టు శ్రీలంక, మెలీ కేర్ న్యూజిలాండ్, లారా వోల్వార్ట్ దక్షిణాఫ్రికా, ఓర్లా ఐర్లాండ్.. ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం ఎంపికయ్యారు.
Aslo Read: Jasprit Bumrah: డబుల్ సెంచరీ చేసిన బుమ్రా
అయితే ఐసీసీ పురుషుల t-20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో జెస్ప్రీత్ బూమ్రా పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంవత్సరం జరిగిన టి-20 వరల్డ్ కప్ లో బూమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్ లలో 4.7 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు బూమ్రా. కానీ అతడిని టి-20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేయకపోవడం గమనార్హం.
Here are the nominees for the ICC Women’s T20I Cricketer of the Year 2024.#ICCAwards #CricketTwitter pic.twitter.com/v9xmcCIMhI
— InsideSport (@InsideSportIND) December 29, 2024
Here are the nominees for the ICC Men’s T20I Cricketer of the Year 2024.#ICCAwards #ArshdeepSingh #BabarAzam #TravisHead #SikandarRaza #CricketTwitter pic.twitter.com/qHAlJFoKNb
— InsideSport (@InsideSportIND) December 29, 2024