CSK VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నీ చాలా రసవత్తరంగా కొనసాగాయి.. ఇప్పటికే 16 మ్యాచులు పూర్తిగా కాగా… ఇవాళ 17వ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Chennai Super Kings vs Delhi Capitals ) జట్ల మధ్య ఫైట్ జరగనుంది. శనివారం కావడంతో ఇవాళ రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే మొదటి మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ చేయనుంది. ఇక ఇవాళ రుతురాజ్ ఆడటం లేదని ప్రచారం జరిగింది. దింతో ధోని కెప్టెన్సీ చేస్తాడని కూడా అన్నారు. కానీ రుతురాజ్ ఆడుతున్నాడు.
Also Read: LSG Vs MI: తిలక్ రిటైర్డ్ హర్ట్.. పాండ్యా పై ట్రోలింగ్.. అసలు ఈ వివాదం ఏంటి?
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే 17వ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ( MA Chidambaram Stadium, Chennai ) జరుగుతోంది. ఈ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ వస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన అన్ని మ్యాచ్లు కూడా జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రికార్డులు
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… ఇందులో ఎల్లో జెర్సీ ఇదే పై చేయి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 30 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 19 మ్యాచులలో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 11 మ్యాచ్లో విజయం సాధించింది. 19 మ్యాచ్ లో ఓడిపోయింది. అంటే ఢిల్లీ పైన చెన్నై సూపర్ కింగ్స్ ఆదిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ రెండు జట్ల మధ్య 2024 సీజన్లో… చివరి మ్యాచ్ జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగులు తేడాతో విజయం సాధించింది.
Also Read: Digvesh Singh Rathi: మరోసారి వివాదం… దిగ్వేశ్‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, KL రాహుల్(w), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(సి), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(w), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరన