CSK VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రస వత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక వివాదం నెలకొంటోంది. నిన్న శనివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Chennai Super Kings vs Delhi Capitals) మధ్య బిగ్ ఫైట్ జరగగా, ఈ మ్యాచ్ సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు నటరాజన్ ఒకే ఓవర్ లో ఏడు లీగల్ బంతులు వేసినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో అంపైర్లు నిద్రపోయారంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా నిన్న చెన్నై వేదికగా CSK వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కారణంగా ఢిల్లీ ఓడిపోయిందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నిన్నటి నుంచి అందరూ స్టబ్స్ గ్లోవ్స్ వ్యవహారం గురించే చర్చిస్తున్నారు. కానీ ఫీల్డ్ అంపైర్లు మరో తప్పిదం కూడా చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చేసే క్రమంలో నటరాజన్ ఒకే ఓవర్ లో ఏకంగా ఏడు లీగల్ డెలివరీస్ వేశాడు. అంపైర్లు నిద్ర పోయిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ 17వ ఓవర్ లో ఏడు బంతులు నటరాజన్ వేయగా, 11 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అంపైర్ల తప్పుడు నిర్ణయం వల్ల ఈ ఓవర్ లో ఏడు బంతులు పడ్డాయని ఢిల్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ఢిల్లీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings vs Delhi Capitals ) మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో నటరాజన్ ఒకే ఓవర్ లో 7 లీగల్ డెలివరీస్ వేశాడని వార్తలు వస్తున్నాయి. నటరాజన్ వేసిన 17వ ఓవర్ సందర్భంగా స్కోర్ బోర్డు మార్చే వాళ్ళు, చేసిన తప్పిదం కారణంగా ఏడు బంతులు లైవ్ లో చూసే వాళ్లకు కనిపించాయని కొంత మంది అంటున్నారు. వాస్తవానికి ఆ ఓవర్ లో ఆరు బంతులు మాత్రమే పడ్డాయని వాదిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిందన్న కుట్ర కోణం నేపథ్యంలో ఇలా వాగుతున్నారని మండిపడుతున్నారు. అంతేకానీ అంపైర్లు నిద్రపోలేదని..ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటున్నారు. సరిగ్గానే లెక్క లేసి బంతులను వేసేలా చూశారని చెబుతున్నారు.
Also Read: Tanveer Ahmed: వైభవ్ సూర్యవంశీ “ఇల్లీగల్ డ్రగ్స్” తీసుకున్నాడు, వెంటనే విచారణ చేయండి
?igsh=dzZoY3h5aDk0N2Jj