Iftikhar Ahmed – LPL 2026: లంక ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Lanka Premier League 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మొన్న జూలై 17వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు కొనసాగనుంది. ఈ టోర్నమెంట్ తుది దశకు వచ్చిన నేపథ్యంలో ఒక్కో జట్టు ఎలిమినేట్ అవుతోంది. తాజాగా దంబుల్లా సిక్సర్స్ జట్టు ( Dambulla Sixers) లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే దీనికి కారణం పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ ( Iftikhar Ahmed) అంటూ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. వీడు కాలు పెట్టగానే జట్టు ఎలిమినేట్ అయిందని దారుణంగా ఆడుకుంటున్నారు.
లంక ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Lanka Premier League 2026) 15 రోజుల కిందటే ప్రారంభం కాగా.. దంబుల్లా సిక్సర్స్ ( Dambulla Sixers) జట్టులోకి నిన్న ఎంట్రీ ఇచ్చాడు పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ ( Iftikhar Ahmed). ఆగస్టు రెండో తేదీ అంటే నిన్నటి నుంచి దంబుల్లా సిక్సర్స్ జట్టు తరుపున ఆడేందుకు…అగ్రిమెంటుపై సంతకం చేశారు. అయితే నిన్న ఇఫ్తికార్ అహ్మద్ టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇవ్వగానే… వరుణుడికి కోపం వచ్చిందో ? లేక వీడు ఆడడం ప్రకృతికి నచ్చలేదో? తెలియదు కానీ నిన్నటి మ్యాచ్ తోనే దంబుల్లా సిక్సర్స్ ఎలిమినేట్ అయింది. ఆగస్టు 2వ తేదీన జఫ్నా కింగ్స్ వర్సెస్ దంబుల్లా సిక్సర్స్ (Jaffna Kings vs Dambulla Sixers, 20th Match) మధ్య పల్లకేలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా 20వ మ్యాచ్ జరిగింది.
అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు ఫజల్హక్ ఫరూఖీ స్థానంలో ఇఫ్తికార్ అహ్మద్ ను జట్టులోకి తీసుకున్నారు. దంబుల్లా సిక్సర్స్ తరఫున ఆడేందుకు సంతకం చేసినప్పటికీ… నిన్నటి మ్యాచ్ లో అతన్ని తీసుకోలేదు. కానీ ఆ జట్టు తరఫున ఆడేందుకు ఇఫ్తికార్ అహ్మద్ సంతకం చేసిన నేపథ్యంలో నిన్నటి మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో దంబుల్లా సిక్సర్స్ వర్సెస్ జఫ్నా కింగ్స్ మధ్య మ్యాచ్ రద్దయింది.. రన్ రేట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో దంబుల్లా సిక్సర్స్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇఫ్తికార్ అహ్మద్ కాలు పెట్టడంతో దంబుల్లా సిక్సర్స్ జట్టుకు దరిద్రం పట్టుకుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వాడి వల్లే వర్షం పడి, మ్యాచ్ రద్దయిందని అంటున్నారు. ఈ క్రమంలోనే దంబుల్లా సిక్సర్స్ ఎలిమినేట్ అయిందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.