DC VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల ( Delhi Capitals vs Lucknow Supergiants ) మధ్య… మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా… ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే కాసేపటికి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ… ముగిసింది.
Also Read: Deepak Chahar’s sister Post: దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి… బాహుబలిలోని కట్టప్ప అంటూ !
ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్… మొదట ఫీల్డింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట… లక్నో బ్యాటింగ్ చేయబోతుంది. ఇక ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ తన పర్సనల్ కారణాల వల్ల దూరం కాబోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో జట్ల ( Delhi Capitals vs Lucknow Supergiants ) మధ్య జరిగే ఈ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగా మనం చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారమవుతోంది. ఇక ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… ఈ రెండు జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో మూడుసార్లు విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రెండు మ్యాచ్లోనే విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య చివరగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగులు తేడాతో విక్టరీ సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సమయంలో ఈ మ్యాచ్ జరిగింది.
ఇక విశాఖపట్నం స్టేడియం వేదికగా లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య… ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ స్టేడియంలో ఈ రెండు జట్లు తల పడలేదు. ప్రస్తుతం జట్ల బలాబలాలను చూసినట్లయితే… లక్నో జట్టుకు అడ్వాంటేజ్ కనిపిస్తోంది. రిషబ్ పంత్ లాంటి డేంజర్ ఆటగాళ్లతో… లక్నో బలంగా ఉంది. గతంలో లక్నో కెప్టెన్ గా కే ఎల్ రాహుల్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా బరిలో దిగనున్నాడు. గతంలో లక్నో ఓనర్ సంజయ్ తో కేఎల్ రాహుల్ కు విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఆ జట్టును వదిలి ఢిల్లీకి వచ్చాడు రాహుల్.
Also Read: CSK vs MI: ఐపీఎల్‌లో బాల్ ట్యాంపరింగ్… CSK పై 2 ఏళ్ళ బ్యాన్ ?
లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు