Jana Nayagan Release Date: చాలామంది సినీ సెలబ్రిటీలు సినిమాల్లో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత కూడా రాజకీయాలపై ఇంట్రెస్ట్‌తో పాలిటిక్స్‌లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ అలాగే తనకు సినిమాల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌ను, పాపులారిటీని పక్కన పెట్టి మరీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ అయ్యాడు. అలాగే కోలీవుడ్‌లో కూడా ఒక స్టార్ హీరో ఉన్నాడు. తను మరెవరో కాదు.. ఇళయదళపతి విజయ్. కోలీవుడ్‌లో విజయ్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.. అలాంటి విజయ్ ఒక్క చివరి సినిమా చేసేసి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాడు. తన చివరి సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ తాజాగా బయటికొచ్చింది.
రిలీజ్ డేట్ ఫిక్స్
ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు విజయ్. కానీ విజయ్‌కు మొదటినుండే రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలా రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా ఉండకపోయినా అప్పుడప్పుడు వాటిని కూడా చూసుకుంటూ తన సినిమాలను ముందుకు నడిపించాడు. ఇప్పుడు సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే టైమ్ వచ్చేసింది అనుకున్నట్టున్నాడు విజయ్. హెచ్ వినోథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ తర్వాత పూర్తిగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నాడు. అందుకే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.
సంతోషం.. బాధ..
సంక్రాంతికి టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. కోలీవుడ్‌లో కూడా ఎన్నో సినిమాలు పోటీపడుతుంటాయి. అందుకే విజయ్ చివరి సినిమా కోసం కూడా 2026 సంక్రాంతినే ఎంచుకున్నారు మేకర్స్. 2026 జనవరి 9న ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా దీని తర్వాత ఇంక విజయ్ వెండితెరపై కనిపించడు అని ఫ్యాన్స్ ఇప్పటినుండే ఫీలవుతున్నారు. విజయ్ స్టైల్, స్వాగ్, డ్యాన్స్‌కు తమిళ ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఇప్పటికీ తనే నెంబర్ 1 హీరో అని ఇతర హీరోల అభిమానులతో ఫ్యాన్ వార్స్ కూడా చేస్తుంటారు.
Also Read: కోహ్లీ, సచిన్‌పై కేసు.. పెద్ద తలకాయలు అయినా.. వదిలేలా లేరు
కౌంట్‌డౌన్ మొదలు
విజయ్ (Vijay) హీరోగా నటించిన సినిమాకు టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్‌లో వస్తున్నాయి. తను చివరిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గోట్’ అనే మూవీలో నటించాడు. ఆ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. అయినా కూడా చాలామంది ఫ్యాన్స్ తృప్తిపడలేదు. అందుకే ‘జన నాయగన్’ అయినా అందరినీ మెప్పించేలా ఉండాలని వారు అనుకుంటున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, ఫార్స్ ఫిల్మ్ కలిసి ‘జన నాయగన్’ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం అప్పుడే కౌంట్‌డౌన్ మొదలయిపోయింది.