KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ 40వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య… కీలక పోరు జరిగింది. లక్నోలోని అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇక ఇందులో… మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టును చిత్తు చేసి… గ్రాండ్ విక్టరీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ.
Also Read: Nicholas Pooran : బంతి తగిలి అభిమానికి గాయం.. పూరన్ చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే
లక్నోపై రివేంజ్ తీర్చుకున్న కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… లక్నో సూపర్ జాయింట్ పై ప్రతికారం తీర్చుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్లో 42 బంతుల్లో 57 పరుగులతో దుమ్ము లేపాడు రాహుల్. ఇందులో మూడు సిక్సర్లతో పాటు మూడు బౌండరీలు ఉన్నాయి. 135 స్ట్రైక్ రేట్తో రఫ్పాడించాడు రాహుల్. చివరి వరకు క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్… జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత.. లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, కె ఎల్ రాహుల్ ఇద్దరు కూడా… హగ్ చేసుకొని.. కాసేపు ముచ్చటించారు.
లక్నో ఓనర్ సంజీవ్ కొంపముంచిన కేఎల్ రాహుల్
మొన్నటి వరకు లక్నోకు ప్రాతినిధ్యం వహించిన కేఎల్ రాహుల్ ను కావాలనే లక్నో సూపర్ జెంట్స్ ఓనర్ సంజీవ్ వదిలించుకున్న సంగతి తెలిసిందే. అయితే… ఆ ప్రతికారాన్ని ఇవ్వాళ తీర్చుకున్నారు కేఎల్ రాహుల్. అదిరిపోయే ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ను విజయతీరాలకు చేర్చారు. లక్నో సొంత గడ్డ పైన… ఢిల్లీ జెండా ఎగరవేశాడు కేఎల్ రాహుల్.
Also Read: Memes on Ashish Nehra: గుజరాత్ ప్లేయర్లలను టార్చర్ చేస్తున్న ఆశిష్ నెహ్రా?
మరోసారి విఫలమైన రిషబ్ పంత్
లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఆడినప్పుడు డక్ ఔట్ అయిన రిషబ్ పంత్… ఇవాళ హోమ్ టౌన్ లో ఆడిన కూడా డక్ అవుట్ అయ్యాడు. దీంతో లక్నో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. దింతో కేఎల్ రాహుల్ అలాగే పంత్ ఇద్దరు కలిసి.. సంజు కొంపముంచుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఇక మొదటి బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ టీం… నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నసపోయి 159 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఇవాల్టి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. 8 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా ఆరు మ్యాచ్లో విజయం సాధించింది. కేవలం రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. అడు ఓటమిపాలైన లక్నో సూపర్ జెంట్స్ ఐదవ స్థానానికి పరిమితమైంది.
— memer manish (@memer_manis) April 22, 2025