RR VS DC Super Over: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025 ) బుధవారం రసవత్తర ఫైట్ జరిగింది. చాలా రోజుల తర్వాత సూపర్ ఓవర్ కు మ్యాచ్ దారితీసింది. దీంతో నాలుగేళ్ల తర్వాత… సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. బుధవారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ జరిగిన మ్యాచ్ డ్రా అయింది. దీంతో రెండు జట్లు.. సూపర్ ఓవర్ ఆడాల్సి ( RR VS DC Super Over )వచ్చింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. టార్గెట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో… అవలీలగా చేదించి.. రికార్డు సృష్టించింది ఢిల్లీ క్యాపిటల్స్.
సూపర్ ఓవర్ లో 12 పరుగుల లక్ష్యాన్ని… చేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణించింది. కేఎల్ రాహుల్ ఒక బౌండరీ కొట్టగా… స్టబ్స్ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. దీంతో మరో రెండు బంతు లు ఉండగానే…. రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇక అంతకుముందు సూపర్ ఓవర్ లో… 11 పరుగులు మాత్రమే చేసింది రాజస్థాన్ రాయల్స్. మొత్తం బంతులు ఆడకముందే.. రెండు వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది రాజస్థాన్.
Also Read: Memes on Abhishek Sharma : అభిషేక్ పరువు తీస్తున్నారు కదరా.. కల్వకుర్తి బజ్జీలు అంటూ
ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ జరిగిన మ్యాచ్ లో మొదటి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు వాడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు… ఏకంగా 188 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్ జట్టు ప్లేయర్లు… దాదాపుగా అందరూ రాణించగలిగారు. ప్రెజర్ 9 పరుగులు చేయగా కరుణ్ నాయర్ డక్ అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరు మినహా అందరూ ఆటగాళ్లు రాణించారు. అభిషేక్ పోరెల్ 49 పరుగులు చేయగా… కె ఎల్ రాహుల్ 32 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అలాగే స్టబ్స్ 34 పరుగులు చేయగా కెప్టెన్ అక్షర్ పటేల్ 34 పరుగులు చేసి రాణించారు. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అనంతరం 189 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… రాజస్థాన్ రాయల్స్ అనేక ఇబ్బందులు పడింది.
Also Read: Sanjay Bangar : రాహుల్ చెత్త ప్లేయర్… బెంగళూరులో తప్ప ఎక్కడ ఆడరాదు
నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి, 188 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. దీంతో మ్యాచ్ డ్రా అయింది. అయితే రాజస్థాన్ ఇన్నింగ్స్ లో… యశస్వి జైస్వాల్ 51 పరుగులు చేసి దుమ్ము లేపాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ప్రక్కటెముకల నొప్పి కారణంగా… సంజు… రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. దీంతో ఆ తర్వాత వచ్చినా నితీష్ రానా 51 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ధ్రువ్ జురెల్ 26 పరుగులు చేయగా హేట్ మేయర్ 15 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ చివర్ లో ఢిల్లీ అద్భుతమైన బౌలింగ్ కారణంగా మ్యాచు డ్రా అయింది.
HE CAN BAT IN TOP ORDER IN TEST CRICKET & HIT SIX IN SUPER OVER 🤯
– One & Only Stubbs….!!!! pic.twitter.com/XnLAZyQDTu
— Johns. (@CricCrazyJohns) April 16, 2025