Daryl mitchell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ( Indian Premier League Tournament ) పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పైన దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ( IPL ) ఇచ్చే.. బహుమతులను ఉద్దేశించి పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను ( Pakistan Super League Tournament ) ఒక ఆట ఆడుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. ఐపీఎల్ లో కార్లు, ఒక్కో ప్లేయర్ కు 50 లక్షల రూపాయలు ఇస్తుంటే… పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మాత్రం… టు వీలర్ వెహికల్స్, హెయిర్ డ్రాయర్లు ఇస్తున్నారు. కొన్ని రోజులైతే ట్రిమ్మర్లు కూడా ఇస్తారని.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత… ఒక్క మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ప్రేయర్లకు హెయిర్ డ్రాయర్లు ( Hair Dryers) అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డారిల్ మిచెల్ ( Daryl Mitchell ) కు కూడా హెయిర్ డ్రాయర్ ఇస్తారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ దారుణంగా చేస్తున్నారు.
Also Read: Sanjay Bangar : రాహుల్ చెత్త ప్లేయర్… బెంగళూరులో తప్ప ఎక్కడ ఆడరాదు
బోడ గుండుకు హెయిర్ డ్రాయర్ ఎందుకు ?
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… తాజాగా కరాచీ కింగ్స్ వర్సెస్ లాహోర్ జట్ల మధ్య ఆరవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో… కరాచీ కింగ్స్ జట్టు పైన లాహోర్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది లాహోర్. అయితే ఈ మ్యాచ్ లో… న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ఏకంగా 75 పరుగులు చేశాడు. 41 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు డారిల్ మిచెల్. ఇందులో రెండు సిక్సర్లతో పాటు తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. దాదాపు 190 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు.
అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించినందుకు డారిల్ మిచెల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కింద హెయిర్ డ్రాయర్ ఇస్తారని.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వాస్తవానికి డారిల్ మిచెల్ కు నిత్యం.. బోడ గుండు ఉంటుంది. అతనికి బాల్ హెడ్ ఉండటంతో ఎప్పుడు.. గుండు తీయించుకుంటాడు. అయితే అలాంటి డారిల్ మిచెల్ కు .. హెయిర్ డ్రాయర్ ఎందుకు అంటూ.. మిమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. హెయిర్ ఉన్నవాళ్లకు హెయిర్ డ్రాయర్లు కావాలి కానీ.. డారిల్ మిచెల్ పరువు తీసేందుకే ఇలా… పాకిస్తాన్ సూపర్ లీగ్ యాజమాన్యం వ్యవహరిస్తుందని కూడా కొంత మంది సెటైర్లు పేల్చుతున్నారు. ఇది ఇలా ఉండగా….. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో కరాచీ కింగ్స్ దారుణంగా విఫలమైంది. డేవిడ్ వార్నర్ అత్యంత దారుణంగా విఫలమై డక్ అవుట్ అయ్యాడు. జేమ్స్ విన్స్ కూడా డకౌట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 19.1 ఓవర్లలో… 136 పరుగులకు ఆల్ అవుట్ అయింది కరాచీ కింగ్స్. ఈ దెబ్బకు 65 పరుగుల తేడాతో విజయం సాధించింది లాహోర్.
Also Read: Memes on Abhishek Sharma : అభిషేక్ పరువు తీస్తున్నారు కదరా.. కల్వకుర్తి బజ్జీలు అంటూ
— Out Of Context Cricket (@GemsOfCricket) April 16, 2025