Memes on Abhishek Sharma : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ మొన్న పంజాబ్ కింగ్స్ పై విధ్వంసకర బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఉప్పల్ జరిగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా భారీ పరుగులు చేశాయి. తొలుత పంజాబ్ కింగ్స్ 245 పరుగులు చేయగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఛేజింగ్ చేసింది. తప్పక గెలవాల్సిన స్థితిలో సన్ రైజర్స్ అదరగొట్టింది. టీ 20 చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.
Also Read : Sara Tendulkar : పొట్టి బట్టలు వేసుకొని కాక రేపుతున్న గిల్ లవర్ సారా
ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ చేసిన సందర్భంలో నా సెంచరీ హైదరాబాద్ ఫ్యాన్స్ కోసం అంకితం అని ఓ నోట్ రాశాడు అభిషేక్ శర్మ. కానీ దాన్ని కొంతమంది వాడుకొని మా దగ్గర బజ్జీలు ఫేమస్ అని రాసుకుంటున్నారు. కల్వకుర్తిలో బజ్జీలు బాగుంటాయని అభిషేక్ శర్మ ఫోటోను వాడుకొని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్ ఓపెనర్లు 37 బంతుల్లో 66 పరుగులు చేసి అతనికి సహకారం అందించాడు.
ఇక ఐపీఎల్ చరిత్రలోనే అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు సాధించిన ఇండియన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ముేఖ్యంగా తన తుఫాన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పంజాబ్ బౌలర్లకు తన విశ్వరూపం ఏంటో చూపించాడు. సెంచరీ అనంతరం అభిషేక్ శర్మ చేసుకున్న సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి. అభిషేక్ శర్మ తన జేబులో ముందుగానే ఓ పేపర్ రాసి పెట్టుకొని వచ్చాడు.
ఆ పేపర్ పై This one is for Orange Army అని రాసి ఉ:ది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తానని ముందే చెప్పాడని.. దానికి అనుగుణంగానే ఈ పేపర్ తన జేబులో పెట్టుకున్నాడని అంతా భావించారు. చెప్పి మరీ సెంచరీ కొట్టాడంటూ అభిమానులు సంతోసం వ్యక్తం చేస్తుంటే.. కొంత మంది పోకిరీలు సోషల్ మీడియాలో అభిషేక్ శర్మను ట్రోలింగ్ చేస్తున్నారు. కల్వకుర్తి బజ్జీలు బాగుంటాయని అభిషేక్ శర్మ ఫొటో వాడుకుంటున్నారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ పై రకరకాల మీమ్స్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.