BigTV English
Advertisement

Dhoni -RCB: పుష్ప డైలాగ్ తో RCBని ర్యాగింగ్ చేసిన ధోని..!

Dhoni -RCB: పుష్ప డైలాగ్ తో RCBని ర్యాగింగ్ చేసిన ధోని..!

Dhoni -RCB: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మార్చ్ 21 నుండి ఈ మహా సమరం ప్రారంభం కాబోతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని జట్లు ఐపిఎల్ కప్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్స్ తో పాటు అభిమానులు కూడా ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు.


Also Read: Kohli – Ranji: ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ.. స్టేడియానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ?

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ వచ్చిందంటే చాలు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సిబి) అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు. ఆర్సిబికి బెంగళూరులోనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక నగరాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ లో మాత్రం అమోఘం. ఈ లీగ్ లో విజయవంతమైన జట్లుగా పేరు ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో సమానంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు ఫ్యాన్ బేస్ ఉంది.


అంచనాలకు ఎప్పుడూ కొదవలేని ఈ జట్టు కప్ గెలవడంలో మాత్రం ప్రతిసారి బోల్తా కొడుతూనే ఉంటుంది. కొన్నేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కి కూడా చేరడానికి కష్టాలు పడుతుంది. ఆర్సిబి కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. అదే రేంజ్ లో ఈ జట్టు ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటుంది. ప్రతి సీజన్ లో ట్రోలింగ్ కి గురికావడం ఈ జట్టుకు పరిపాటిగా మారిపోయింది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ ఇంకా ప్రారంభం కాకముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై ట్రోలింగ్ మొదలైంది.

తాజాగా ఆర్సిబిని ట్రోలింగ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. ఆర్సిబి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని సవాల్ చేస్తున్నట్లుగా ట్రోల్ చేశారు. పుష్ప 2 సినిమాలో పుష్ప రాజ్.. పోలీస్ ఆఫీసర్ బనావర్ సింగ్ షెకావత్ కి సవాల్ ఉసురుతూ.. ” దమ్ముంటే పట్టుకోరా షెకావతు.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు” అంటూ పాడే పాటని.. పుష్పా స్థానంలో ధోని, షెకావత్ స్థానంలో కోహ్లీ వీడియోతో ట్రోల్ చేశారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఆర్సీబీ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఐపీఎల్ లో కప్ కొట్టేవరకు ఆర్సిబికి కష్టాలు తప్పవేమో. ఇక ఐపీఎల్ 2025 ఆర్సిబి జట్టు ప్లేయర్స్ విషయానికి వస్తే..

Also Read: Surya Kumar Yadav: మిస్టర్ 360 టీమిండియాలో ఉండి దండగ.. సూర్యపై దారుణంగా ట్రోలింగ్స్

విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్, లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 8.75 కోట్లు), ఫిల్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు), జితేష్ శర్మ (రూ. 11 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ (రూ. 12.50 కోట్లు), రసిఖ్ దార్ (రూ. 6 కోట్లు), సుయాష్ శర్మ (రూ. 2.60 కోట్లు), కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ. 10.75 కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ. 50 లక్షలు), టిమ్ డేవిడ్ (రూ. 3 కోట్లు), రొమారియో షెపర్డ్ (రూ. 1.50 కోట్లు), నువాన్ తుషార (రూ. 1.60 కోట్లు), మనోజ్ భాండాగే (రూ. 30 లక్షలు), జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు), దేవదత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు), స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు), లుంగి ఎన్‌గిడి (రూ. 1 కోటి), అభినందన్ సింగ్ (రూ. 30 లక్షలు), మోహిత్ రాతీ (రూ. 30 లక్షలు).

Related News

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Big Stories

×