BigTV English

Eating Fast: టైం అవుతుందని గబగబా తినేస్తున్నారా ?.. అయితే మీరు అనారోగ్యం బారిన పడినట్లే

Eating Fast: టైం అవుతుందని గబగబా తినేస్తున్నారా ?.. అయితే మీరు అనారోగ్యం బారిన పడినట్లే
Eating Fast
Eating Fast

Eating Fast: బిజిబిజీగా గడిపే సిటీ లైఫ్‌లో తినడానికి కూడా సమయం ఉండట్లేదు. సంపాదించాలనే ఆలోచనతో నిరంతరం ఆఫీసు పనుల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా తరచూ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అసలు తినడానికే టైం ఉండట్లేదంటూ ఏది దొరికితే అది.. కడుపునిండిందా అంతే చాలు.. అనుకుని ఆ రోజును గడిపేస్తుంటారు. మనం చేసే పనే.. మన పొట్టకు కడుపునిండా తిండి పెట్టి కాస్త తృప్తిగా, ప్రశాంతంగా తినడానికి. అలాంటిది అసలు తినడానికే సమయం లేకుండా గబగబా తినడం వల్ల నష్టాలే కలుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


తరచూ గబగబా తింటూ ఉరుకుల పరుగుల జీవితాల్లో భోజనానికి సమయం కేటాయించకపోవడం అనేది ముమ్మాటికి అనారోగ్యానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఫాస్ట్‌గా తినడం వల్ల అసలు ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందవని చెబుతున్నారు. ఆహారాన్ని ఎప్పుడు ప్రశాంతంగా కూర్చుని కాస్త సమయం కేటాయించి తినాలంటున్నారు.

Also Read: ఎండలో తిరిగి వచ్చి ఫ్రిడ్జ్ నీళ్లు తాగుతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే


ఆహారం తీసుకునే సమయంలో ఎటువంటి ఫోన్లు, పనులు పెట్టుకోవద్దట. కేవలం తినే ఆహారం పైనే దృష్టి పెట్టాలట. ఆహారాన్ని నోటితో తీసుకుంటే నోటిలోనే సగం జీర్ణం అయ్యేలా తినాలట. అంతే ఆహారాన్ని బాగా నమిలి తినాలట. ఇలా నమలడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అదే గబగబా తినడం వల్ల ఆహారం మొత్తం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లి కడుపునొప్పి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత యాసిడ్ రిలీజ్ అవుతుందట. అనంతరం ఎసిడిటీ ఫామ్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆహారాన్ని పూర్తిగా నమిలి తినకపోవడం మూలంగా కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా తరచూ ఇలాగే తినడం మూలంగా ఎసిడిటీ బారిన పడతారట. అందువల్ల తరచూ ఆహారాన్ని తీసుకునే సమయంలో ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా తినాలి.

Note: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×