Drama between Ashwin and Haris Rauf: మేజర్ లీగ్ క్రికెట్ 2026 టోర్నమెంట్ ( Major League Cricket 2026 Tournament) ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ జూన్ 18వ తేదీన షురూ అయింది. జూలై 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 6 జట్లు పాల్గొననుండగా, 34 మ్యాచులు జరుగుతాయి. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ( San Francisco Unicorns) జట్టు తరఫున రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin), హారిస్ రౌఫ్ ( Haris Rauf ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకే డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటున్నారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. అశ్విన్ దేశద్రోహి అంటూ దారుణంగా పోస్టులు కూడా పెట్టారు.
మేజర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Major League Cricket 2026 Tournament) నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ పై దేశద్రోహి ముద్ర పడింది. ఐతే దానిని చాలా తెలివిగా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అశ్విన్. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ( San Francisco Unicorns) జట్టు తరఫున ఆడుతున్న అశ్విన్… తుది జట్టులో హారిస్ రౌఫ్ ( Haris Rauf ) ఉంటే తాను ఆడబోనని అంటూ కండిషన్ పెట్టాడట. వాడితో ఆడితే, దేశం నుంచి తనను తరిమేస్తారని యాజమాన్యానికి ముందే తెలిపాడట. ఈ క్రమంలో యాజమాన్యం కూడా అశ్విన్ కండిషన్స్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అశ్విన్ ఆడిన మ్యాచ్ లలో రఫ్ కు అవకాశం ఇవ్వడం లేదు శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టు యాజమాన్యం. హారిస్ రౌఫ్ ను ఆడించినప్పుడు అశ్విన్ ను డగౌవుట్ లో కూర్చోబెడుతున్నారు.
ఇలా ఇద్దరు ఒకేసారి ఆడిన సందర్భాలైతే ఇప్పటివరకు జరగలేదు. ఈ టోర్నమెంట్ లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ మూడు మ్యాచ్ లు ఆడింది. ఈ మూడు మ్యాచ్ లలో అశ్విన్ ఆడితే, రఫ్ ఆడడం లేదు… రఫ్ అంటే అశ్విన్ ఆడడం లేదు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అశ్విన్ కండిషన్స్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. ఇండియా పై ఉన్న గౌరవంతోనే, పాకిస్తాన్ ఆటగాడిని అశ్విన్ తొక్కేస్తున్నాడని అంటున్నారు. అమెరికా గడ్డపై కూడా పాకిస్తాన్ ను ఒక ఆట ఆడుకుంటున్నాడని అశ్విన్ ను మెచ్చుకుంటున్నారు.
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ఓవర్సీస్ ఆటగాళ్ల పరిమితి రూల్ ఉంటుంది. ఒక మ్యాచ్ లో కేవలం ఆరుగురు విదేశీ క్రికెటర్లు మాత్రమే ఆడాలి. ఈ క్రమంలో అశ్విన్ ఆడినప్పుడు రఫ్ కు అవకాశం దక్కడం లేదు లేదు. అంతేకాదు శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టులో ఎక్కువగా విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అందుకే అశ్విన్, రఫ్ లలో ఒకే ఒక్కరికి అవకాశం దక్కుతోంది.