E-Paper
Advertisement

Kissik talks:పానీపూరీ తింటే హార్ట్ అటాక్ వస్తుందా?..అసలు విషయం చెప్పిన కామాక్షి

Kissik talks:పానీపూరీ తింటే హార్ట్ అటాక్ వస్తుందా?..అసలు విషయం చెప్పిన కామాక్షి
Advertisement

Kisick Talks: బిగ్ టీవీ నిర్వహిస్తున్న ‘కిసిక్ టాక్స్’ లో పాల్గొన్న కామాక్షి భాస్కర్ల ఆరోగ్యం, డైట్, స్కిన్ కేర్, పిల్లల మానసిక ఆరోగ్యం, బయట ఫుడ్ తినడం వంటి అంశాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.వీకెండ్ వచ్చిందంటే డైట్ ఫాలో అయ్యేవాళ్లకు ‘చీటింగ్ డే’ పెట్టుకోవచ్చా? అనే సందేహం చాలామందికి ఉంటుందని కామాక్షి తెలిపారు.

అయితే అది ప్రతి ఒక్కరి డైట్, తీసుకునే ఆహారం, శరీర పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కొంతమంది వారంలో ఒకరోజు తమకు నచ్చిన ఫుడ్ తీసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని, కానీ రెగ్యులర్‌గా ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనేది కూడా ముఖ్యమని వివరించారు.

ఒక్కొక్కరికి ఒక్కో విధంగా

Advertisement

అలాగే స్కిన్ టైప్ విషయంలోనూ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని కామాక్షి చెప్పారు. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉండటంతో చెమట, దుమ్ము, వాతావరణ పరిస్థితుల కారణంగా చర్మ సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందన్నారు. మనం తీసుకునే ఆహారం, లైఫ్‌స్టైల్ కూడా చర్మంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. డైరీ ప్రొడక్ట్స్‌తో పాటు కొన్ని ఆహార పదార్థాలు కొంతమందికి పడకపోవచ్చని, అయితే అందరికీ ఒకే రకమైన సమస్య వస్తుందని చెప్పలేమన్నారు.

చిన్న పిల్లలపై ప్రభావం చూపే అవకాశం

ఇక పిల్లలు హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసినప్పుడు భయపడే అంశంపైనా కామాక్షి స్పందించారు. ఇలాంటి సినిమాల్లోని ఇంటెన్స్ సన్నివేశాలు, యాక్టింగ్ చిన్న పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. కొంతమంది పిల్లలు సినిమా చూసిన తర్వాత కూడా ఆ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ భయపడుతుంటారని, అందుకే పిల్లలు ఎలాంటి సినిమాలు చూస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించడం మంచిదని సూచించారు.

Advertisement

also read :Kissik talks: వెంకటేష్ అంటే పిచ్చి.. పాట పాడి మరీ చెప్పిన కామాక్షి!

పానీపూరీకి ,హార్ట్ అటాక్‌కు సంబంధం

ఇక పానీపూరీ తింటే హార్ట్ అటాక్ వస్తుందనే ప్రచారంపైనా కామాక్షి క్లారిటీ ఇచ్చారు. పానీపూరీకి నేరుగా హార్ట్ అటాక్‌కు సంబంధం ఉందని చెప్పడం సరైనది కాదన్నారు. అయితే బయట ఫుడ్ తినేటప్పుడు పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శుభ్రంగా లేని నీరు, కలుషితమైన పదార్థాలు లేదా సరిగ్గా నిల్వ చేయని ఫుడ్ తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు.

కాస్ట్లీ ఎందుకు  ఉంటాయంటే 

చిన్నపిల్లలకు ఇచ్చే కొన్ని ఇంజెక్షన్లు ఎందుకు అంత కాస్ట్లీ  ఎందుకు  ఉంటాయనే అంశంపైనా ఆమె మాట్లాడారు. అరుదైన వ్యాధులకు అవసరమయ్యే కొన్ని ఇంజెక్షన్ల తయారీ, పరిశోధన ఖర్చులు ఎక్కువగా ఉండటంతో వాటి ధరలు కూడా భారీగా ఉండే అవకాశం ఉందన్నారు. తలసేమియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు ప్రత్యేకమైన చికిత్స అవసరమవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో మందులు, ఇంజెక్షన్ల ఖర్చు కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపుతుందని వివరించారు.

also read :Kissik talks:అనుష్కతో పోలికా.. కామాక్షి క్రేజ్ మామూలుగా లేదుగా!

చివరగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ప్రచారాన్ని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని కామాక్షి సూచించారు. డైట్, స్కిన్ సమస్యలు, పిల్లల ఆరోగ్యం వంటి అంశాల్లో సరైన సమాచారం తెలుసుకోవడంతో పాటు అవసరమైనప్పుడు మంచి డాక్టర్స్ ని కలవడం ముఖ్యం అంటూ సలహా ఇచ్చాడు

Tags

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×