Richest Cricket Boards: ప్రపంచంలోనే అత్యంత సంపన్నబోర్డ్ గా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా {BCCI} పేరుగాంచింది. ఇతర క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో ఉన్న బీసీసీఐ.. ప్రపంచ క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుంది. ప్రతి సంవత్సరం తమ నికర ఆదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ పోతుంది.
Also Read: Vaibhav Suryavanshi: 14 ఏళ్ల సూర్య వంశీతో తెలుగులో ఇంటర్వ్యూ… మనతో వైభవ్ హై
పలు నివేదికల ప్రకారం బీసీసీఐ క్రికెట్ బోర్డు నెట్ వర్త్ సుమారు 20,686 కోట్లు. మరే ఇతర క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ దరిదాపుల్లో కనిపించడం లేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,493 కోట్లుగా ఉన్న బీసీసీఐ నగదు బ్యాంకు బ్యాలెన్స్.. 2024 ముగింపు నాటికి రూ. 20,686 కోట్లకు చేరింది. అంటే సుమారుగా 4200 కోట్ల మేర ఆదాయం పెరిగిందని బీసీసీఐ తన డాక్యుమెంట్ లో పేర్కొంది. ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} కొనసాగుతుంది.
ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా బీసీసీఐకి అధిక మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. అలాగే ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో భారీ మొత్తంలో అర్జిస్తుంది బీసీసీఐ. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ల ద్వారా కూడా దండిగానే సంపాదిస్తోంది. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. ప్రత్యక్ష పన్నులు చెల్లించకుండా బీసీసీఐకి భారత ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దేశంలో ఈ లీగ్ క్రికెట్ ను ప్రోత్సహించేందుకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ టోర్నీని నిర్వహిస్తున్నామని బీసీసీఐ తెలిపింది.
ఇన్కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రీబ్యునల్ {ఐటిఏటి} ఈ అప్పీల్ చేయడంతో ఈ మినహాయింపు లభించింది. దాంతో ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ఆదాయం రెట్టింపు అయ్యింది. ఇక బీసీసీఐ తర్వాత రెండవ స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ఉంది. ఆస్ట్రేలియా 658 కోట్లు, ఇంగ్లాండ్ 492 కోట్లు, పాకిస్తాన్ 458 కోట్లు, బంగ్లాదేశ్ 425 కోట్లు, సౌత్ ఆఫ్రికా 392 కోట్లు, జింబాబ్వే 317 కోట్లు, శ్రీలంక 166 కోట్లు, వెస్టిండీస్ 125 కోట్లు, న్యూజిలాండ్ 75 కోట్లు. బీసీసీఐకి అతిపెద్ద ఆదాయ వనరు ఏంటంటే ప్రతి జట్టు నుండి బీసీసీఐ సెంట్రల్, స్పాన్సర్షిప్, టికెట్ ఆదాయంలో 20%, లైసెన్సింగ్ ఆదాయంలో 12.5% పొందుతుంది.
బిసిసిఐ ప్రతి జట్టుకు లీగ్ స్థానం ఆధారంగా స్థిర సెంట్రల్ ఇన్కం, వేరియబుల్ ఆదాయాన్ని అందిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ తన ఆదాయాన్ని పెంచుకుంది. నిజానికి 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 7476 కోట్ల మేర ఆదాయం అర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనూహ్య రీతిలో 8995 కోట్ల రెవెన్యూ వచ్చింది. దీంతో ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీసీఐ రూ. 10,054 కోట్ల ఆదాయం అర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బీసీసీఐ {BCCI} పరిధిలో 38 స్టేట్ క్రికెట్ బోర్డ్ విభాగాలు ఉన్నాయి.