Fatima Sana in The Hundred 2026: టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ టోర్నమెంటులో పాకిస్తాన్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన రెండు మ్యాచ్ లలో పాకిస్తాన్ ఓడిపోయింది. అయితే పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ.. ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ది హండ్రెడ్ లీగ్ 2026 మహిళల టోర్నమెంట్ (Fatima Sana in The Hundred 2026) కోసం ఆమె సెలెక్ట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఈ టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఫాతిమా సనా. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు (Birmingham Phoenix) తరఫున ఈ ఏడాది ఆడ బోతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తరఫున ది 100 లీగ్ ఆడుతున్న తొలి మహిళా క్రికెటర్ గా ఆమె రికార్డు సృష్టించారు.
టి20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) నేపథ్యంలో మొన్న దక్షిణాఫ్రికాపై అర్థ సెంచరీతో రెచ్చిపోయిన ఫాతిమా సనా (Fatima Sana ), బౌలింగ్ లో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ఫాతిమా సనాకు ది 100 లీగ్ టోర్నమెంటులో బంపర్ ఆఫర్ తగిలింది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు తరఫున ఆడాలని… ఆ జట్టు యాజమాన్యం ఆఫర్ ఇచ్చింది. 5.6 మిలియన్ పాకిస్తానీ రూపాయలు ఫాతిమా సనకు ఆఫర్ కూడా ఇచ్చింది. అంటే దాదాపు ఈ సీజన్ లో ఆడితే 18 లక్షల పైగా ఆమె సంపాదించనుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ లూసీ హామీల్టన్ ఈ టోర్నమెంట్ నుంచి దూరం అవుతున్న నేపథ్యంలో… ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫాతిమా సనాను సెలెక్ట్ చేశారు.
నిన్న వైల్డ్ కార్డు డ్రాఫ్ట్ జరగగా… ఫాతిమా సనాను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు ఎంపిక చేసుకుంది. ఇక ఈ ఎంపిక నేపథ్యంలో పాకిస్తాన్ తరఫున ది 100 లీగ్ ఆడబోతున్న తొలి మహిళగా ఫాతిమా రికార్డు సృష్టించబోతోంది. ఇక ఇదే టోర్నమెంటులో పురుషుల విభాగంలో అబ్రార్ అహ్మద్ సన్ రైజర్స్ లీడ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఉస్మాన్ తారిక్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరఫున బరిలో దిగుతున్నాడు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కావ్య పాపపై ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేశారు. దేశద్రోహి అంటూ రెచ్చిపోయి పోస్టులు పెట్టారు. అయినప్పటికీ ఆమె తగ్గలేదు.
Fatima Sana will become the first Pakistan player to feature in the women's Hundred this year after she was signed by Birmingham Phoenix in Thursday's wildcard draft#Hundred #FatimaSana pic.twitter.com/Bbwc6xy9Hi
— Ali Tanoli (@alitanoli889) June 18, 2026