Nita Ambani: కొంతమంది క్రికెటర్లు ఒకప్పుడు ఇంట్లో తినడానికి తిండి కూడా లేని దుర్భర పరిస్థితిలను చూశారు. ఒక్క పూట తిని.. మరో పూటకు పస్తులుంటూ ఎన్నో బాధలను భరించేవారు. కొంతమంది రోజు గడపడానికి చిన్న వయసులోనే దినసరి కూలీలుగాను మారారు. కానీ తమకు వచ్చొచ్చిన ఆటలో రాత్రి, పగలు కష్టపడి తమను తాము మెరుగుపరుచుకున్నారు. అవకాశాలు రావడమే తరువాయి.. వారంటే ఏంటో నిరూపించుకున్నారు.
Also Read: IND vs PAK Ticket price: ఫ్యాన్స్ కు షాక్.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ. 4 లక్షలు?
అలా పేదరికంతో జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి.. క్రికెట్ కారణంగా జీవితాలను మార్చుకున్న ప్లేయర్లలో పాండ్యా బ్రదర్స్ కూడా ఉంటారు. చాలా క్రికెటర్ల మాదిరిగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} పాండ్యా బ్రదర్స్ జీవితాలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టులో ఎవరైనా డొమెస్టిక్ ప్లేయర్ గా చేరితే.. వారు త్వరలోనే భారత జట్టుకు ఎంపిక అవ్వడం గ్యారెంటీ. ఇలా కృణాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్.. ఇలా దాదాపు అర డజన్ పైగా ప్లేయర్లు భారత్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు.
ఇక ఐపీఎల్ 2015 సీజన్ లో హార్దిక్ పాండ్యాని 10 లక్షలకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఆ తర్వాత సంవత్సరం హార్దిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్యా కూడా ముంబై ఇండియన్స్ లోకి వచ్చాడు. ఈ ఇద్దరు సోదరులు కలిసి ముంబై ఇండియన్స్ విజయాలలో కీలక పాత్ర పోషించారు. 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కి ఆడిన హార్దిక్ పాండ్యాని.. ముంబై ఇండియన్స్ భారీ ధరకు తీసుకుంది. ఇక 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ కి కెప్టెన్సీ చేసిన హార్దిక్ పాండ్యాని 2025 సీజన్ కి రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.
అయితే ఐపీఎల్ 2025 సీజన్ కి ముందు హార్దిక్ పాండ్యా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకుంది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాని నీతా అంబానీ. “క్రికెట్ లో రాణించాలనే తపన, ఆకలి హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా లో ఉన్నాయి. అందుకే వారిని జట్టులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఐపీఎల్ లో మనందరికీ ఒక నిర్దిష్ట బడ్జెట్ ఉంటుంది. ప్రతి టీమ్ కూడా అంతే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే సత్తా ఉన్న ప్లేయర్లను కనిపెట్టడానికి మేము కొత్త మార్గాలను వెతకడం మొదలుపెట్టాం.
నేను ప్రతి రంజీ మ్యాచ్ కి వెళ్ళేదాన్ని. దేశవాళీ మ్యాచ్ లు చూసేదాన్ని. అలా మేము ఓ రోజు బక్క పలుచగా ఉన్న ఇద్దరు కుర్రాళ్లను క్యాంపులో చూసాం. తరువాత నేను వారితో మాట్లాడుతున్నప్పుడు.. వారు మూడు సంవత్సరాలుగా డబ్బులు లేక మ్యాగీ, నూడిల్స్ తప్ప మరేమీ తినలేదని చెప్పారు. అందుకే ఇలా బక్కగా అయ్యామని తెలిపారు. వాళ్ల దగ్గర సరిగ్గా తినడానికి కూడా డబ్బులు లేవు. కానీ వారిలో సక్సెస్ కావాలనే కసిని నేను గమనించాను.
Also Read: Virat Kohli: బీసీసీఐ కండిషన్స్.. దుబాయిలో వాంతులు చేసుకున్న కోహ్లీ.. ఆ ఫుడ్ ఎఫెక్ట్ ?
వాళ్లే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. 2015లో హార్దిక్ పాండ్యా ని మేము కొనుగోలు చేశాము. అప్పుడు అతడు ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా ఉన్నాడు. ప్రతి ఏడాది కూడా మా స్కాట్ టీమ్ కొత్త కుర్రాళ్ల కోసం వెతుకుతూనే ఉంటుంది. బుమ్రాని కూడా అలాగే పట్టుకువచ్చాము. అతను ఇప్పుడు టీమిండియా సూపర్ స్టార్. తిలక్ వర్మని కూడా అలాగే తీసుకువచ్చాము. ఇప్పుడు తిలక్ టీమిండియా ప్లేయర్. ముంబై ఇండియన్స్ భారత్ క్రికెట్ టీమ్ కి నర్సరీగా మారింది” అని చెప్పుకొచ్చింది నీతా అంబానీ.