SRH Moises Henriques To Portugal: ఒకప్పటి సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) ఆటగాడు, ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మోయిసెస్ హెన్రిక్స్ ( Moises Henriques ) గురించి తెలియని వారు ఉండరు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మెరిశాడు. ఆస్ట్రేలియా తరఫున పెద్దగా పాపులర్ కానీ ఈ మోయిసెస్ హెన్రిక్స్, ఐపీఎల్ ద్వారా మాత్రం తెలుగు అభిమానులకు దగ్గరయ్యాడు. అలాంటి ఆస్ట్రేలియా దిగ్గజా ఆటగాడు మోయిసెస్ హెన్రిక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియాను ( Australia) వీడి పోర్చుగల్ దేశానికి ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 39 సంవత్సరాలు ఉన్న మోయిసెస్ హెన్రిక్స్, ఇకపై పోర్చుగల్ (Portugal) జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ సంవత్సరం ఆగస్టులో జరగబోయే టి20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ జరుగనుంది. ఈ క్రమంలోనే తన సొంత దేశం పోర్చుగల్ కు మోయిసెస్ హెన్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తాడని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మోయిసెస్ హెన్రిక్స్ ( Moises Henriques )… పోర్చుగల్ లో పుట్టి పెరిగినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టు తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. 2021 వరకు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత అతనికి జాతీయ జట్టులో అవకాశాలు రాకపోవడంతో తన 34వ ఏట అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు మళ్లీ తన సొంత పోర్చుగల్ దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఏడాది ఆగస్టులో టి20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ జరగనుంది. ఈ క్రమంలోనే తన సొంత దేశమైన పోర్చుగల్ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం 2021లో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మోయిసెస్ హెన్రిక్స్… లాంగ్ బ్రేక్ తీసుకొని, కూలింగ్ పీరియడ్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పోర్చుగల్ తరఫున ఆడేందుకు లైన్ క్లియర్ అయింది.
ఐపీఎల్ ప్రారంభమైన నుంచి పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ హెన్రిక్స్. 2009 సంవత్సరంలో కేకేఆర్ జట్టు తరఫున ఐపిఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2010లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి… 2011లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిపోయాడు. బెంగళూరు తరఫున 2013 సీజన్ లో మెప్పించాడు. అయితే చివరకు 2014 నుంచి 2017 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఎక్కువ రోజులు ఆడాడు. అంతేకాదు 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్ గెలవగా… ఇందులో హెన్రిక్స్ కీలక పాత్ర పోషించాడు.