Lava Agni 4: స్మార్ట్‌ఫోన్ల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి లక్కీ ఛాన్స్ వచ్చింది. ప్రముఖ టెక్ సంస్థ లావా.. గతేడాది మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘లావా అగ్ని 4’పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది నిజంగానే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.
అమెజాన్‌లో లావా అగ్ని 4 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. అయితే.. ఐసీఐసీఐ బ్యాంక్ లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే ఏకంగా రూ.4,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ.23,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు.. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.26,500 వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది.
Also Read: యాపిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. మార్కెట్లోకి ఫస్ట్ Foldable iPhone, డిజైన్ చూస్తే ఫ్లాట్ అయిపోతారు!
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. లావా అగ్ని 4లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతో ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మెరుగైన పనితీరు కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రొసెసర్‌ను ఉపయోగించారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను చాలా స్మూత్‌గా రన్ చేస్తుంది.
ఈ ఫోన్ కెమెరా ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీని వెనుక వైపు OIS సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరాతో పాటు.. 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరాను ఇవ్వడం విశేషం. దీనివల్ల సెల్ఫీలు, వీడియో కాల్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. అలాగే.. దీనిలోని 5000mAh బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా ఇస్తున్నారు. 5G, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఎన్‌ఎఫ్‌సీ వంటి అన్ని లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ Lava Agni 4లో ఉన్నాయి.
Also Read: స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ షేక్.. ఏకంగా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వన్‌ప్లస్ N6 లాంచ్!