Monty Panesar On Rohit-kohli: 2027 వన్డే వరల్డ్ కప్ అనంతరం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ (Monty Panesar)
సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ మరికొన్ని రోజులపాటు వన్డేలు ఆడాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తే… వన్డే క్రికెట్ అంతరించిపోతుందని హెచ్చరించారు.
ఆ ఇద్దరు ఉంటేనే వన్డేలు చూసేందుకు జనాలు ఎగబడతారని వివరించారు. టీమిండియా వన్డే లు ఆడితే, కోట్లాదిమంది చూసేందుకు ఎగబడుతున్నారని గుర్తు చేశారు. అలాంటిది మెయిన్ పిల్లర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ఇస్తే టీవీల్లో కూడా మ్యాచ్ లను ఎవరు చూడబోరని బాంబు పేల్చారు. ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించిన రోజున తాను టీవీ పగలగొడతానని వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రోకో కాంబో రిటైర్మెంట్ పై మాంటీ పనేసర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా జట్టులో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కంటే యంగ్ క్రికెటర్లు చెత్తగా ఆడుతున్నారని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ (Monty Panesar) ఫైర్ అయ్యారు. ప్రతి మ్యాచ్లో జట్టును ఆదుకునేది ఈ ఇద్దరేనని గుర్తు చేశారు. వీళ్ళిద్దరూ వికెట్ కోల్పోతే టీమిండియాను కాపాడే నాధుడే లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ఫిట్నెస్ కలిగి ఉన్న ఈ ఇద్దరు… మరో మూడు సంవత్సరాల పాటు వన్డే క్రికెట్ ఆడాల్సిందేనని తేల్చి చెప్పారు. బీసీసీఐ కూడా దీనిపై ఫోకస్ చేయాలని కోరారు. బలవంతంగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావాలని ఈ ఇద్దరిపై ఒత్తిడి చేయకూడదని రిక్వెస్ట్ చేశారు.
వన్డే క్రికెట్ బతకాలంటే రోహిత్ శర్మ అటు విరాట్ కోహ్లీ ఇద్దరు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గ్రహించకుండా కొంతమంది రోకో కాంబినేషన్ రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేనని చెత్త పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గురించి కూడా చాలా భిన్నమైన అభిప్రాయాన్ని పనేసర్ వ్యక్తం చేశారు. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ… రీ ఎంట్రీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. టెస్ట్ క్రికెట్ లో మరికొన్ని రోజులు కొనసాగి ఉంటే బాగుండేది అన్నారు. చాలామంది రిటైర్మెంట్ ప్రకటించి.. రీ ఎంట్రీ ఇస్తున్నారు… ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అలాగే టెస్టుల్లోకి రావాలని కోరారు.