E-Paper
Advertisement

పాకిస్తాన్ వెళ్లిన రాజీవ్ శుక్లా…ఇంజామామ్ తో బిర్యానీ పార్టీ కూడా!

పాకిస్తాన్ వెళ్లిన రాజీవ్ శుక్లా…ఇంజామామ్ తో బిర్యానీ పార్టీ కూడా!
Advertisement

 Inzamam Ul Haq With Rajiv Shukla:టీమిండియా అలాగే పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితిలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి క్రమంలో బీసీసీఐ అధికారిగా ఉన్న రాజీవ్ శుక్లా సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ ఒకప్పటి కెప్టెన్ ఇంజమాం ఉల్ హాక్ ను ఆయన కలిశారు. అది కూడా పాకిస్తాన్ కు వెళ్లి రాజీవ్ కలవడం హాట్ టాపిక్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటో కూడా బయటకు వచ్చింది. అంతేకాదు ఈ ఇద్దరు సమావేశమైన తర్వాత…బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాకు (BCCI Vice President Rajiv Shukla) మంచి బిర్యానీ పార్టీ ఇచ్చారట. తన ఇంటికి రాజీవ్ శుక్లాను తీసుకువెళ్లి మరి ఇంజమం బిర్యాని తినిపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన బయటకు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లాపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా యి. రాజీవ్ శుక్లా దేశద్రోహి అని కొంతమంది అంటుంటే… అతడిని దేశం నుంచే తరిమి కొట్టాలని హెచ్చరిస్తున్నారు మరికొందరు. వెంటనే తన పోస్ట్ ను కూడా తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఇంజమం ను రాజీవ్ శుక్లా ఎందుకు కలిశారంటే ?

ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు రద్దయిన సంగతి తెలిసిందే. 2008 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కు ఇండియా వెళ్లడం లేదు… ఇండియా పర్యటనకు పాకిస్తాన్ జట్టు రావడం లేదు. క్రికెట్ ఒక్కటే కాదు.. మిగతా క్రీడాలలో కూడా ఇదే ధోరణితో భారత్ ముందుకు సాగుతోంది. అయితే, 2023 ఆసియా కప్ నేపథ్యంలో పాకిస్తాన్ వెళ్ళాడు బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆదేశాల మేరకు పాకిస్తాన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు చూశారు. అంతేకాకుండా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ అక్కడ కలిసారు. గంటపాటు ఈ ఇద్దరు సమావేశం అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత బిర్యానీ పార్టీలో కూడా ఇద్దరు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత మరికొంతమంది పాకిస్తాన్ మాజీలతో బిసిసిఐ అధికారి రాజీవ్ శుక్లా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

ఇంతకు 2023 ఆసియా కప్ ఎప్పుడు, ఎక్కడ జరిగిందంటే ?

ఆసియా కప్ 2023 టోర్నమెంట్ 2023 ఆగస్ట్ 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా, టీమిండియా మ్యాచ్ లు మాత్రం శ్రీలంకలో జరిగాయి. ఫైనల్స్ లో శ్రీలంకను ఓడించి, టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

గ్యారీ కిర్‌స్టెన్ పీకింది లేమీ లేదు…2011 వ‌ర‌ల్డ్ క‌ప్ అత‌ని వ‌ల్ల రాలేదు

టీమిండియా మ‌హిళ‌ల గోల్డ్ మెడ‌ల్స్ దొంగిలించిన మొహ్సిన్ న‌ఖ్వీ ?

అంపైర్ మెడపై కత్తి పెట్టి బెదిరించి, టీమిండియా గెలిచింది

ఇంట్లో పిల్లి, బ‌య‌ట మాత్రం పులి.. అభిషేక్ శర్మ పరువు తీసిన ఇంజమామ్

రివర్స్ స్లీప్ ఆడితే, వైడ్ బాల్ రూల్స్ మార‌తాయి..మాజీ అంపైర్ అనిల్ క్లారిటీ

జహీర్ ఖాన్ ను మధ్యలోనే గెంటేస్తారు…CSK జట్టుపై అబ్దుల్ రజాక్ సంచలనం ?

నిద్రపోయిన అంపైర్.. సంజు సిక్సర్ కొడితే, 4 ఇచ్చాడు

Big Stories

Advertisement
×