Kamran Akmal On Ireland vs India: ఐర్లాండ్ చేతిలో టీమిండియా (Ireland vs Team India) ఓడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. 2026 టి20 ప్రపంచ కప్ (2026 T20 World Cup ) గెలిచిన టీమిండియా, పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం సొంత అభిమానులు కూడా జీర్ణించుకోవడం లేదు. పక్క ప్రణాళిక వేసిన ఐర్లాండ్, టీమిండియా జట్టును చావు దెబ్బ కొట్టింది. అయితే శుక్రవారం జరిగిన మొదటి టీ20 లో 34 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమ్ ఇండియా పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. టీమిండియా పొగరును దించేలా ఐర్లాండ్ ఆడిందని తాజాగా కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ శత్రువు ఇండియాను ఓడించినందుకు గాను ఐర్లాండ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టారు కమ్రాన్ అక్మల్. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (Ireland vs Team India) మధ్య నిన్న టి20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) ప్రారంభమైంది. అయితే ఇందులో సులభంగా గెలవాల్సిన టీమిండియా… ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓడిపోయింది. అయితే బలమైన టీమిండియాను ఓడించిన ఐర్లాండ్, ఐదుగురు కీలక ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగింది. కొత్త కుర్రాళ్ళు వచ్చినప్పటికీ, టీమ్ ఇండియాకు చుక్కలు చూపించారు. ఇదే విషయాన్ని కమ్రాన్ అక్మల్ తాజాగా వెల్లడించారు. ఐర్లాండ్ జట్టులో ఉన్న పాల్ స్టిర్లింగ్, జోష్ లిటిల్, మార్క్, కర్టిస్, బారీ లాంటి ఐదుగురు క్రికెటర్లు గాయాల కారణంగా ఐర్లాండ్ జట్టుకు దూరమయ్యారని కమ్రాన్ అక్మల్ వెల్లడించారు. ఈ ఐదుగురు లేకుండానే టక్కర్ కెప్టెన్సీలో టీమిండియా ఓడిపోయిందని పరువు తీశారు. అదే పాత సీనియర్ ప్లేయర్లు అయిదుగురు ఆడి ఉంటే, వందలోపే టీమిండియా ఆల్ అవుట్ అయ్యేదంటూ పరువు తీశారు. కోట్లలో డబ్బులు ఉన్న బీసీసీఐ పొగరు కూడా ఐర్లాండ్ దించిందని వ్యాఖ్యానించారు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన తొలి t20 మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ సేన దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసి 182 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పోరాడిన టీమిండియా 148 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో 34 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవలసి వచ్చింది. ఆదివారం రోజున ఈ రెండు జట్ల మధ్య చివరి టీ20 ఉంది.