E-Paper
Advertisement

కేవ‌లం నెట్స్ లో ప్రాక్టీస్ చేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌తామంటే కుద‌ర‌దు !

కేవ‌లం నెట్స్ లో ప్రాక్టీస్ చేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌తామంటే కుద‌ర‌దు !
Advertisement

Irfan Pathan On Kohli and Rohit : 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ చోటు దక్కడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరికి అవకాశాలు ఇస్తేనే.. 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామని మాజీ క్రికెటర్ల నుంచి అభిమానులు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని కించపరిచేలా మాజీ టీమిండియా ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం నెట్స్ లో ప్రాక్టీస్ చేసి.. 2027 వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా జట్టులో స్థానం దక్కాలంటే అస్సలు కుదరదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతి మ్యాచ్ లో ఆడాల్సిందేనని వెల్లడించారు. ఇప్పటి నుంచి 2027 వన్డే వరల్డ్ కప్ వరకు గ్రౌండ్ లో ప్రతి మ్యాచ్ ఆడాల్సిందేనని పేర్కొన్నారు. అలాంటి వాళ్లకే టీమ్ ఇండియాలో అవకాశం ఇవ్వాలని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కేవ‌లం నెట్స్ లో ప్రాక్టీస్ చేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌తామంటే కుద‌ర‌దు !

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ టీమిండియాలో అవకాశం కల్పించాలని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ క్రికెటర్లకు వన్డే ప్రపంచ కప్ జట్టులో స్థానం ఊరికే ఇవ్వకూడదని పేర్కొన్నారు. సీనియర్ల అన్న ఒక్క కారణంతో.. వాళ్లకు అవకాశాలు ఇస్తే, వన్డే వరల్డ్ కప్ గెలవడం కష్టమైందని తేల్చి చెప్పారు.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కష్టపడి.. ఫిట్నెస్ సాధించి జట్టులో తమ స్థానాన్ని సంపాదించుకోవాల్సిందేనని వెల్లడించారు. సీనియర్స్ అన్న ఒక్క కారణంతో అనవసరంగా వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని, డిమాండ్ చేశారు. నెట్స్ లో కొన్ని ఓవర్లు బ్యాటింగ్ చేసి.. మేము ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ఆడతామంటే అస్సలు కుదరదు అన్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ తో పాటు ప్రదర్శన చేస్తేనే 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేయాలని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశారు.

గౌతమ్ గంభీర్ కోచింగ్ పై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ గెలిచే లక్ష్యంగా గౌతమ్ గంభీర్ చేస్తున్న ప్రయోగాలను ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించారు. కొత్త కుర్రాలకు అవకాశాలు ఇచ్చి మంచి పని చేస్తున్నాడన్నారు. వచ్చే ఏడాది కాలంలో మంచి ప్రదర్శన చూపించిన కొత్త కుర్రాలను కూడా వన్డే వరల్డ్ కప్ కోసం తీసుకోవాలని పేర్కొన్నారు. బుమ్రా లాంటివాళ్ళు గాయపడుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయ ఆటగాళ్ల కోసం ట్రై చేయాలని వివరించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో కూడా గౌతమ్ గంభీర్ కఠినంగా ఉండాలని డిమాండ్ చేశారు.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

Related News

బంగ్లాదేశ్ లో టీమిండియాకు సెక్యూరిటీ లేదు..స్టేడియంపై దాడులు జ‌రిగే ఛాన్స్‌?

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబర్ కు కొమ్ములు వ‌చ్చాయి, అత‌డి PR ఎగిరిపడుతోంది

హార్ధిక్ పాండ్యా రీ-ఎంట్రీ..గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు ?

న‌ఖ్వీ మాట విని రోడ్డున బంగ్లాదేశ్‌…ఫుట్ బాల్ ఆడుకుంటోన్న BCCI

ఆసియా క‌ప్ లాగే 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా దొంగిలించిన మొహ్సిన్ న‌ఖ్వీ?

హార్ధిక్ పాండ్యాకు వ‌రుస ఆఫ‌ర్లు…అడ్డుక‌ట్ట వేసిన అంబానీ ?

ట్రావిస్ హెడ్ తిక్క కుదిర్చిన కావ్య మారన్..? ఖుషీలో కోహ్లీ ఫ్యాన్స్

Big Stories

Advertisement
×