E-Paper
Advertisement

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబర్ కు కొమ్ములు వ‌చ్చాయి, అత‌డి PR ఎగిరిపడుతోంది

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబర్ కు కొమ్ములు వ‌చ్చాయి, అత‌డి PR ఎగిరిపడుతోంది
Advertisement

Ahmed Shehzad On Babar Azam: వెస్టిండీస్ జట్టుపై రెండో టెస్ట్ లో గెలిచిన తర్వాత పాకిస్తాన్ సారధి బాబర్ ఆజం పైన (Babar Azam) సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్ పరువు నిలబెట్టిన మొనగాడు.. మూడేళ్ల తర్వాత జట్టును గెలిపించిన హీరో అంటూ ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నారు. అతడి గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా తెగ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం పరువు తీస్తూ అహ్మద్ షెజాద్ (Ahmed Shehzad ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక మ్యాచ్ గెలవగానే బాబర్ ఆజంకు కొమ్ములు వచ్చాయని హేళన చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక టెస్ట్ గెలవగానే వరల్డ్ కప్ గెలిచినట్లుగా అతని పీఆర్ టీం రెచ్చిపోయి పోస్టులు పెడుతోందని ఎద్దేవా చేశారు. ఈ ఫేక్ ప్రచారంతో బాబర్ ఆజంను వైట్ బాల్ క్రికెట్ కు కెప్టెన్ చేయాలని కుట్రలు జరుగుతున్నాయని బాంబు పేల్చారు అహ్మద్ షెజాద్. దీంతో అహ్మద్ షెజాద్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి.

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబర్ కు కొమ్ములు వ‌చ్చాయి – అహ్మద్ షెజాద్

వెస్టిండీస్ పై రెండో టెస్ట్ గెలిచిన నేపథ్యంలో… కెప్టెన్ బాబర్ ఆజం పైన మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తుంటే, అహ్మద్ షెజాద్ (Ahmed Shehzad ) మాత్రం అతడిని కించపరిచేలా మాట్లాడారు. ఒక మ్యాచ్ గెలవగానే బాబర్ ఆజం కు సంబంధించిన పిఆర్ టీం రంగంలోకి దిగిందని హేళన చేశారు. బాబర్ ను హీరో చేస్తూ, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బాబర్ ఆజం గురించి డబ్బా కొట్టడం తప్ప ఏమీ లేదని పరువు తీశారు. ఒక టెస్ట్ గెలవగానే అతడిని మళ్లీ వైట్ బాల్ క్రికెట్ కు కూడా కెప్టెన్ చేయాలని ప్రచారం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. ఈ ప్రచారం నమ్మి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఓ మెట్టు దిగివచ్చి బాబర్ ఆజంకు మూడు ఫార్మాట్స్ కెప్టెన్సీ ఇస్తే మాత్రం, పాకిస్తాన్ సంకనాకి పోవడం గ్యారంటీ అని హెచ్చరించారు.

షాహిన్ అఫ్రిదినే వన్డే కెప్టెన్ గా కొనసాగించాలి

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup ) దగ్గర పడుతున్న నేపథ్యంలో షాహిన్ అఫ్రిదినే వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్ గా కొనసాగించాలని డిమాండ్ చేశారు అహ్మద్ షెజాద్ (Ahmed Shehzad ). బాబర్ ఆజంకు వన్డే కెప్టెన్సీ ఇస్తే పాకిస్తాన్ గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

Related News

హార్ధిక్ పాండ్యా రీ-ఎంట్రీ..గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు ?

న‌ఖ్వీ మాట విని రోడ్డున బంగ్లాదేశ్‌…ఫుట్ బాల్ ఆడుకుంటోన్న BCCI

ఆసియా క‌ప్ లాగే 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా దొంగిలించిన మొహ్సిన్ న‌ఖ్వీ?

హార్ధిక్ పాండ్యాకు వ‌రుస ఆఫ‌ర్లు…అడ్డుక‌ట్ట వేసిన అంబానీ ?

ట్రావిస్ హెడ్ తిక్క కుదిర్చిన కావ్య మారన్..? ఖుషీలో కోహ్లీ ఫ్యాన్స్

విరాట్ కోహ్లీకి ఒళ్లంతా పొగ‌రే…వాడిని చూస్తేనే నాకు కంప‌రం !

మ‌హ్మ‌ద్ సిరాజ్ బ్యాట్ లో AI చిప్స్‌…చెక్ చేసిన జ‌య‌సూర్య‌!

Big Stories

Advertisement
×