Hardik Pandya Wants Gujarat Titans Return: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (2027 Indian Premier League tournament) నేపథ్యంలో ఏ జట్టులోకి వెళ్తాడనే దానిపైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సీటుకే హార్దిక్ పాండ్యా ఎసరు పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా వస్తానంటే.. మళ్లీ గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాజాగా యాజమాన్యం ప్రకటించింది.
అయితే, ఆ ఆఫర్ కు ఓకే చెప్పిన హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ ఇవ్వాలని కండీషన్ పెట్టాడట. కెప్టెన్సీ ఇస్తేనే, గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వస్తానని తేల్చి చెప్పారట. అయితే, హార్దిక్ పాండ్యా కండిషన్ ను కెప్టెన్ గిల్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తే తాను బయటకు వెళ్లిపోతానని యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టులో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు
ముంబై ఇండియన్స్ జట్టును వీడి మరో ఫ్రాంచైజీకి ఆడేందుకు హార్థిక్ పాండ్యా డిసైడ్ అయ్యాడు. ఇలాంటి క్రమంలో హార్దిక్ పాండ్యాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి మొదలుకొని కేకేఆర్ జట్ల వరకు దాదాపు 9 జట్లు హార్దిక్ పాండ్యా కోసం ఎగబడుతున్నాయి. అయితే, లేటెస్ట్ గా గుజరాత్ టైటాన్స్ లోకి రావాలని హార్దిక్ పాండ్యాకు ఆఫర్ ఇచ్చిందట యాజమాన్యం. ఈ నేపథ్యంలో ఆ జట్టుకే కండిషన్ పెట్టినట్లు హార్దిక్ పాండ్యా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ ఇస్తేనే, తాను ఆ జట్టులోకి వస్తానని మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం తెలియగానే జట్టులోకి వస్తే తనకు ఓకే అని చెప్పిన గిల్.. కెప్టెన్సీ మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారట. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తే, తన రూట్ తాను చూసుకుంటానని యాజమాన్యానికి గిల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాండ్యా విషయంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం వెనక్కి తగ్గినట్లు సమాచారం. గిల్ చెప్పినట్లుగానే వినేందుకు సిద్ధం అయింది. దీంతో పాండ్యా నోట్లో మట్టి కొట్టినట్లైంది. ఇది ఇలా ఉండగా, పాండ్యా కెప్టెన్సీలోనే గుజరాత్ కు టైటిల్ వచ్చింది. అయితే టైటిల్ అందించిన తర్వాత ముంబై ఇండియన్స్ నుంచి కెప్టెన్సీ ఆఫర్ రావడంతో.. గుజరాత్ టైటాన్స్ ను వీడి మళ్లీ అంబానీ జట్టులోకి వెళ్ళాడు.