E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

త‌ప్పుల త‌డ‌క‌గా స్కోర్ బోర్డు, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ క్యాన్సిల్

త‌ప్పుల త‌డ‌క‌గా స్కోర్ బోర్డు, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ క్యాన్సిల్
Advertisement

Abhishek Sharma Fifty Cancel:  ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (Ireland vs. Team India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) జరుగుతోంది. శుక్రవారం ఈ రెండు జ‌ట్ల మధ్య టి20 సిరీస్ షురూ అయింది. అయితే ఇందులో శుక్రవారం సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్, బెల్‌ఫాస్ట్ వేదిక‌గా ( Civil Service Cricket Club, Belfast) జరిగిన తొలి మ్యాచ్ లోనే టీమిండియా చెత్త ప్రదర్శన కనబరిచి ఓటమి పాలైంది. దీంతో టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోతారా? కొంచమైనా సిగ్గుందా? అంటూ ఫైర్ అవుతున్నారు. టి20 ఛాంపియన్ అయి ఉండి, అనామక జట్టు చేతిలో ఓడిపోతే పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Also Read:  Silver Siegers Missed Run out Tazmin Brits: ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

త‌ప్పుల త‌డ‌క‌గా స్కోర్ బోర్డు, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ క్యాన్సిల్

Advertisement

ఐర్లాండ్ చేతిలో టీమిండియా (Ireland vs. Team India) ఓడిపోయిన బాధలో అభిమానులు ఉంటే, డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఊహించని షాక్ తగిలింది. ఐర్లాండ్ పైన 19 బంతుల్లోనే అర్థ సెంచరీ (Abhishek Sharma Fifty) చేసిన అభిషేక్ శర్మకు, అంపైర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఐర్లాండ్ పై శుక్రవారం చేసిన అర్థ సెంచరీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అభిషేక్ శర్మ ఖాతాలో ఈ అర్థ సెంచరీ (Abhishek Sharma Fifty Cancel) అధికారికంగా రికార్డు కాలేదు. 19 బంతుల్లో 50 పరుగులు చేసినట్లుగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్రాడ్ కాస్టర్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతర ఫ్లాట్ ఫామ్స్ లలో కూడా అభిషేక్ శర్మ (Abhishek Sharma ) అర్థ సెంచరీ చేసినట్లు పేర్కొన్నారు. బీసీసీఐ ( BCCI), క్రిక్ బజ్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత, అర్థ సెంచరీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 20 బంతులు ఆడిన అభిషేక్ శర్మ, 49 పరుగులు చేసినట్లుగా కౌంట్ ఫైనల్ చేశారు. రెండవ ఓవర్ లో అభిషేక్ శర్మ తీసిన సింగిల్ లెగ్ బై గా ప్రకటించడమే, ఎందుకు కారణమని తెలుస్తోంది. ఇక ఎనిమిదవ ఓవర్ లో అవుట్ అయ్యేవరకు అది సింగిల్ గానే కౌంట్ చేశారు. కానీ చివరికి ఆ సింగిల్ తొలగించడంతో… అభిషేక్ శర్మ అర్థ సెంచరీ రద్దయింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఇదే తొలిసారి అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అభిషేక్ శ‌ర్మ అర్ధ సెంచ‌రీ ర‌ద్దు కావ‌డంపై అత‌ని ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు. అంపైర్లు, నిర్వాహకులు నిద్ర‌పోతున్నారా ? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదే విష‌యం ముందే చెబితే, అభిషేక్ శ‌ర్మ ఔట్ అయ్యే వాడు కాదంటున్నారు.

Advertisement

Also Read: PAT CUMMINS, TRAVIS HEAD TO MISS IPL 2027: అనుకున్న‌దే జ‌రిగింది..కావ్య కొంప‌ముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

Related News

ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !

టీమిండియా పాలిట శాపంగా మారిన ప్ర‌కృతి..ఐర్లాండ్ చేతిలో సిరీస్ దొబ్బిన‌ట్టే !

ఐర్లాండ్ ఒక్కటే కాదు ఇంగ్లాండ్ తోనూ ఓడిపోతారు…లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతా!

విదేశీ పిచ్ ల‌పై టీమిండియాకు ఆడ‌టం చేత‌కాదు, అందుకే ఐర్లాండ్ చేతిలో ప‌ళ్లు రాల‌గొట్టుకున్నారు

IND VS IRE: ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి…మంచు విష్ణు డైలాగ్ వైర‌ల్

వైభ‌వ్ ఇంకా స్కూల్ కు వెళ్లే పిల్లాడే, ఘోరంగా అవ‌మ‌నించిన ఐసీసీ

షోయ‌బ్ అక్త‌ర్ సోద‌రుడి అంత్య‌క్రియ‌లు..హాజ‌రైన‌ పహల్గామ్ సూత్రధారి

కెప్టెన్సీ చేత‌కాక‌పోతే, త‌ప్పుకుని ఇంట్లో కూర్చో..శ్రేయ‌స్ పై సెహ్వాగ్ సీరియ‌స్

Big Stories

×