BigTV English

KL Rahul: ఒకప్పుడు బ్యాట్ కూడా అమ్ముడుపోలేదు.. కానీ ఇప్పుడు లార్డ్స్ మ్యూజియంలోనే Kl రాహుల్ వస్తువులు

KL Rahul: ఒకప్పుడు బ్యాట్ కూడా అమ్ముడుపోలేదు.. కానీ ఇప్పుడు లార్డ్స్ మ్యూజియంలోనే Kl రాహుల్ వస్తువులు

KL Rahul: 2023 నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో ట్రావీస్ హెడ్ రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అప్పటివరకు పది మ్యాచ్ లు గెలిచిన భారత జట్టు.. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది.


Also Read: IPL 2026: KKR జట్టులోకి సంజు, రానా… వెంకటేష్ అయ్యర్ ఔట్.. షారుక్ ఖాన్ భారీ ప్లాన్?

అయితే ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ చెత్తగా ఆడాడని, 107 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ కేవలం 66 పరుగులు చేసి భారత జట్టు ఓడిపోవడానికి కారణమయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు. అతడి ఇన్నింగ్స్ లో ఏకంగా 49 డాట్ బాల్స్ ఉన్నాయి. ఇక ఈ ఫైనల్ లో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులకు కేఎల్ రాహుల్ బ్యాట్ ని వేలం వేశారు. 2023 చారిటీ వేలంలో ఈ బ్యాట్ అమ్ముడుపోలేదు. 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఆ బ్యాట్ నే ఉపయోగించాడు.


అయితే అదే వేలంలో విరాట్ కోహ్లీ సంతకం చేసిన జెర్సీ, మహేంద్ర సింగ్ ధోని సంతకం చేసిన బ్యాట్ వంటి ఇతర వస్తువులు వేలం వేయబడ్డాయి. ఇక అక్కడినుండి తన నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకున్న కేఎల్ రాహుల్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు కేఎల్ రాహుల్. లార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక మైదానంలో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

లండన్ లోని లార్డ్స్ మైదానాన్ని క్రికెట్ కి పుట్టినిల్లుగా అభివర్ణిస్తారు. అత్యంత పురాతనమైన ఈ మైదానంలో మెరుగైన ప్రదర్శన చేయడాన్ని క్రికెటర్లందరూ ఓ గౌరవంగా భావిస్తారు. అయితే క్రితం సారి పర్యటనలో ఇదే మైదానంలో టెస్ట్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. ఈసారి కూడా అదే రిపీట్ చేశాడు. మూడవ టెస్ట్ లోని తొలి ఇన్నింగ్స్ లో 176 బంతుల్లో మూడు అంకెల మార్క్ అందుకున్నాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత బంతికే కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. మొత్తంగా ఇంగ్లాండ్ లో ఆరో సెంచరీ చేసిన కె.ఎల్ రాహుల్.. పలు రికార్డులను బద్దలుకొట్టాడు.

Also Read: Ravindra Jadeja: రేపు నైట్ వస్తావా? జడేజాకు లేడీ క్రికెటర్ బంపర్ ఆఫర్ ?

రాహుల్ ఇప్పటివరకు టెస్టుల్లో పది సెంచరీలు చేయగా.. అందులో నాలుగు సెంచరీలు ఇంగ్లాండ్ గడ్డపైనే చేయడం గమనార్హం. ముఖ్యంగా లార్డ్స్ లోనే రెండు సెంచరీలు బాదాడు. దీంతో దిలీప్ వెంగ్ సర్కార్ తర్వాత లార్డ్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన రెండవ భారత క్రికెటర్ గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత రాహుల్ ని వన్డే జట్టు నుంచి తొలగించాలని చాలామంది డిమాండ్ చేశారు. అనంతరం చారిటీ వేలంలో అతడి బ్యాట్ పై కూడా ఎవరు ఆసక్తి చూపించలేదు. అలాంటి కేఎల్ రాహుల్ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా అతడు సంతకం చేసిన జెర్సీని లార్డ్స్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు.

Related News

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Big Stories

×