Kohli Retirement Gambhir| టెస్ట్ క్రికెట్ నుంచి కింగ్ కోహ్లీ ఒక్కసారిగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఒక వైపు రోహిత్ శర్మ, మరోవైను విరాట్ కోహ్లి కొన్ని రోజుల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించేయడంతో క్రికెట్ అభిమానులు షాక్ కు గురయ్యారు. కోహ్లి ఫిట్ నెస్ బాగానే ఉన్నా.. ఇంత త్వరగా రిటైర్మెంట్ తీసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అని ప్రతి క్రికెట్ ఫ్యాన్ అడుగుతున్న ప్రశ్న. దీనికి కారణాలు బహిరంగంగా ఎవరూ చెప్పకపోయినా.. టీమిండియాలో వచ్చిన అనూహ్య మార్పుల గురించి రవి చంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్ క్రికెటర్లు పరోక్షంగా చెప్పారు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లి లాంటి దిగ్గజాలు లేకపోవడంతో ఇక అంతా గంభీర్ ఇష్టా రాజ్యమని విమర్శలు చేస్తున్నారు.
నిజానికి గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టి నప్పటి నుంచి వరుసగా ఇండియన్ క్రికెట్ టీమ్ లో కీలక మార్పులు జరుగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో చూస్తే.. కెప్టెన్సీ నుంచి కోచింగ్ స్టాఫ్ వరకు , ఇంకా సీనియర్ ఆటగాళ్లందరినీ గంభీర్ కొత్తవారితో రిప్లేస్ చేశాడు. ఇకపై కొత్త టెస్ట్ క్రికెట్ టీమ్ ఏర్పాటు చేయాలనే ప్రణాళికలో భాగంగానే ముందునుంచి గంభీర్ ఈ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పులతో పాటు సీనియర్ ఆటగాళ్లపై గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఒత్తిడి చేస్తున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలిసింది. కొన్ని నెలల క్రితం టెస్ట్ క్రికెట్ ని అశ్విన్ రవి చంద్రన్ ఈ ఒత్తిడి కారణంగానే గుడ్ బై చెప్పాడని.. రోహిత్ శర్మ కూడా ఆటతీరు సరిగా కనబర్చడం లేదని అతడిని గంభీర్ టీమ్ చివాట్లు పెట్టడం కారణంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడని జాతీయ మీడియా కోడైకూస్తోంది.
అయితే అన్నింటి షాకింగ్ విషయమేమిటంటే మరి కొన్ని రోజుట్లో టీమిండియా ఇంగ్లాండ్ టూర్ వెళ్లాల్సి ఉండగా.. ఫామ్ లో ఉన్న కోహ్లీ కూడా ఒక్కసారిగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. గంభీర్ చెప్పినట్లు చేయాల్సిందేనని చీఫ్ సెలెక్టర్ రెండు సార్లు కోహ్లీకి ఫోన్ చేసి బెదిరించినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. తనకు సన్నిహితుడైన రోహిత్ పట్ల ప్రవర్తించిన తీరు, తనతో బెదిరింపు ప్రవర్తన కారణాంగానే విరాట్ కోహ్లీ తనకు ఇక టీమ్ లో స్వేచ్ఛ లేదని భావించి రిటైర్మెంట్ ప్రకటించాడని మీడియా వర్గాలు తెలిపాయి.
Also Read: ఐపీఎల్ ఓనర్లకు కొత్త టెన్షన్.. కోట్లల్లో డబ్బులు నష్టం ?
ఇక నెక్స్‌ట్ కెప్టెన్ ఎవరు?
ఈ విషయం గురించి స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ ‘ఆష్ కీ బాత్’ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అశ్విన్ మాట్లాడతూ.. టీమిండియా లో రోహిత్ స్కిల్స్, కోహ్లి ఎన్ర్జీ ఒక మంచి జోడీ అని చెప్పాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఇద్దరూ లేకపోవడంతో జట్టులో శూన్యం ఏర్పడింది. ఇక సెలెక్టర్లు తదుపరి టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌ను ఎంపిక చేయాలి. ఆస్ట్రేలియాలో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంటులో రోహిత్ లేని సమయంలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించాడు. అయితే ఇప్పుడు శుభ్‌మన గిల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ నాకు బుమ్రాపై నమ్మకం ఉంది. నేను అస్సలు ఊహించలేదు వారిద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటిస్తారని. ఇది ఇండియన్ క్రికెట్ కు పరీక్షా సమయం. నేను ఒక్కటైతే కచ్చితంగా చెబుతున్నా.. ఇకపై అంతా గౌతమ్ గంభీర్‌దే రాజ్యం.” అని అన్నాడు.