Sanju Samson: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సాంసంగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో వికెట్ కీపింగ్ త్యాగం చేయనున్నట్లు పేర్కొన్నాడు. కేవలం బ్యాటర్ గానే బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలను ఓ యువ ఆటగాడికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇకపై వికెట్ కీపింగ్ బాధ్యతలను యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ కి అప్పగించనున్నట్లు వెల్లడించాడు.
Also Read: America under-19 cricket: అమెరికా జట్టు కెప్టెన్ గా తెలుగమ్మాయి
ఈ విషయంపై ఇప్పటికే దృవ్ జురెల్ తో చర్చించినట్లు పేర్కొన్నాడు. అతడు కూడా బాధ్యతలను తీసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు సంజూ. దృవ్ జురెల్ టెస్ట్ వికెట్ కీపర్ గా రాణించాడని.. అతడు ఐపిఎల్ లోను వికెట్ కీపింగ్ బాధ్యతలను తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నాడు. తాను ఫీల్డర్ గా ఉంటూ ఇప్పటివరకు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించలేదని.. ఇది తనకు ఓ కొత్త సవాల్ లాంటిదని అన్నాడు. కెప్టెన్ గా తన బాధ్యతలను నిర్వహిస్తూనే.. జట్టులోని ఆటగాళ్లకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు.
సంజూ బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీ బాధ్యతలపైనే పూర్తిగా దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దృవ్ జురెల్ ఈ సంవత్సరం ఆరంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తరువాత వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తి ఫిట్నెస్ తో జట్టులోకి తిరిగి రావడంతో జూరెల్ వికెట్ కీపర్ బాధ్యతలను కోల్పోవలసి వచ్చింది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని పెర్త్ టెస్ట్ లో పంత్, జురెల్ ఇద్దరూ ఆడినప్పటికీ.. ఆ తరువాత జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో జురెల్ బెంచ్ కే పరిమితమయ్యాడు.
ఇక కేరళకు చెందిన వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ 2015 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. జింబాబ్వేతో జరిగిన టి-20 సిరీస్ సందర్భంగా పొట్టి ఫార్మాట్ లోకి అడుగు పెట్టాడు. ఆరేళ్ల తర్వాత వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ టెస్టుల్లో మాత్రం ఇంతవరకు స్థానం దక్కించుకోలేకపోయాడు. ఇక 2021లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు సంజు. 2022లో తన జట్టుని ఫైనల్స్ కి చేర్చి సత్తాచాటాడు.
Also Read: Rohit Sharma – Ravi Shastri: రోహిత్ శర్మ బ్యాటింగ్ పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
టి-20 ఫార్మాట్ లో సంజూకి మంచి రికార్డు ఉంది. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడగలడు. సంజు 13 మ్యాచుల్లో 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 436 పరుగులు చేశాడు. ఇక ఈ సంవత్సరం రెండు సెంచరీలు సాధించాడు. ఇందులో 31 సిక్సర్లు బాదాడు. ఇలాంటి ఆటగాడికి త్వరలో మొదలు కాబోతున్న విజయ్ హజారే ట్రోఫీలో నిరాశ ఎదురైంది. కేరళ క్రికెట్ అసోసియేషన్ క్యాంప్ కి హాజరుకానందున విజయ్ హజారే కేరళ జట్టు నుంచి సంజు శాంసంన్ ని పక్కన పెట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కేరళ క్రికెట్ బోర్డ్ అతనిపై వేటువేసింది.