Hardik Pandya: టీమిండియా యంగ్ క్రికెటర్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో… స్థానాన్ని దక్కించుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఇండియన్ ప్రీమియర్ లీగ్… టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా… నేరుగా టీమిండియాలోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియాలో ( Team India) హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ పాత్రను పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఉండే ఆల్రౌండర్ల తరహాలో… హార్దిక్ పాండ్యా ఇప్పుడు టీమిండియాలో కొనసాగుతున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురు వచ్చినా… జట్టు విజయమే లక్ష్యంగా ఆడుతున్నాడు.
Also Read: Team India Cash prize: టీమిండియాకు BCCI భారీ నజరానా..ICC కంటే ఎక్కువే.. ఎన్ని కోట్లంటే ?
అయితే అలాంటి టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జీవితం గురించి…. బయోపిక్ తీయాలని…. ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా… ఇప్పటికే అనేక కష్టాలను అనుభవిస్తున్నాడు అని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా గత ఏడాదికాలంగా తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాడు అని గుర్తు చేశారు.
అలాంటి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బయోపిక్ ( Hardik Pandya biopic ) తీస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మహమ్మద్ కైఫ్. ఈ విషయంలో… ఎవరో ఒకరు దర్శకుడు ముందుకు రావాలని కూడా కోరారు. గత ఏడాది కాలంలోనే తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రోలింగ్ కూడా గురైనట్లు మహమ్మద్ కైఫ్ వెల్లడించారు. అలాంటి రెండు సమస్యలు ఉన్నప్పటికీ.. టి20 వరల్డ్ కప్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో… టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించినట్లు తెలిపాడు మహమ్మద్ కైఫ్ ( Mohammed Kaif ). అయితే టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బయోపిక్ అనగానే… అందరూ నాచురల్ స్టార్ నాని పేరును గుర్తు చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా బయోపిక్ లో… నాని… చేయాలని కోరుతున్నారు.
Also Read: Mumbai Indians: ఐపీఎల్ 2025 కంటే ముందే ముంబైకి షాక్..ఇద్దరు ప్లేయర్లు దూరం ?
ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం…. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సిద్ధం అవుతున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఈ సారి కొనసాగనున్నాడు. అయితే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైట్ ఉంది. ఆదివారం అంటే మార్చి 23వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఆడటం లేదు హార్దిక్ పాండ్యా. గత సీజన్ పెనాల్టీ కారణంగా ఈ సారి ఒక్క మ్యాచ్ కు దూరం అవుతాడు హార్దిక్ పాండ్యా.