Hardik – Krunal : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఏమో చెప్పలేని పరిస్తితి నెలకొంది. ముఖ్యంగా టీమిండియా లో అయితే ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. కొంత మంది క్రికెటర్లు రిటైర్మెంట్.. మరికొంత మంది క్రికెటర్లు న్యూ ఎంట్రీ.. ఊహించనివిదంగా టీమ్ ఎంపిక చేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు కొందరూ క్రికెటర్లు తమ చిన్ననాటి కోచ్, గురువులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. మరికొందరూ తమ అభిమానులకు కూడా సాయం చేస్తుంటారు.ఇక రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అది ఏంటంటే..?
Also Read : Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం
టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మంచి మనస్సు చాటుకున్నారు. తమ చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్ కి రూ.80లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా తమ కోచ్ జితేంద్ర నే ఓ మీడియా కి వెల్లడించాడు. తన చిన్న చెల్లెలు పెళ్లి కోసం రూ.20లక్షలు, కారు కోసం రూ.20 లక్షలు, తల్లి చికిత్స కోసం రూ.20లక్షలు, ఇతర అవసరాల కోసం రూ.18 లక్షల కోసం.. ఇలా ఇప్పటివరకు 70 నుంచి 80 లక్షల వరకు ఇచ్చారని వెల్లడించారు. టీమిండియా క్రికెటర్లలో ప్రస్తుతం పాండ్యా బ్రదర్స్ హవా కొనసాగుతోంది. ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. మరోవైపు కృణాల్ పాండ్యా మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2025 జట్టులో స్తానం సంపాదించాడు. ఆ జట్టులో కీలక ఆల్ రౌండర్ కూడా. టీమిండియా విజయంలో పాండ్యా కీలక పాత్ర పోషించనున్నాడు. పాండ్యా బౌలింగ్ లో, అటు బ్యాటింగ్ లో రాణిస్తాడు. దాయాది జట్టు పాకిస్తాన్ కి చుక్కలు చూపించడంలో పాండ్యా కీలక పాత్ర పోషించనున్నాడు.
ఐపీఎల్ లోకి ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాలో చోటు సంపాదించుకున్న పాండ్యా బ్రదర్స్ భారీగా డబ్బు అర్జించిన క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా ముందుంటాడు. కానీ తాను ఎదిగిన తరువాత కూడా చిన్నప్పటి గురువును మాత్రం మరిచిపోలేదు. అన్న కృనాల్ పాండ్యాతో కలిసి తన కోచ్ కి సాయం చేశారు. కోచ్ జితేంద్ర సింగ్ కి ఉన్న దుస్తులు అన్ని కూడా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యానే కొనిచ్చారట. ఇప్పటి వరకు పాండ్యా సోదరులు 80 లక్షల వరకు సాయం చేసి ఉంటారు. 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీ సాధించగానే కృనాల్ రూ.18 లక్షలు సాయం చేశాడట. ఎల్లవేళలా తమ కోచ్ సౌకర్యంగా ఉండాలనే భావిస్తారట. తమది దిగువ తరగతి కుటుంబం అయినప్పటికీ.. వారు మాత్రం తనకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారని కోచ్ వెల్లడించడం విశేషం. టీచర్స్ డే రోజున తమ కోచ్ ఈ వివరాలను వెల్లడించడం గొప్ప విషయం.